Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ బుర్ఖా ధరించడానికి ఇష్టపడని భార్య పన్ను విరగొట్టిన ఓ ముస్లిం వ్యక్తి అని షేర్ చేస్తున్నారు

0

బుర్ఖా ధరించడానికి ఇష్టపడని భార్య పన్ను విరగొట్టిన ఓ ముస్లిం వ్యక్తి అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

                ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: బుర్ఖా ధరించడానికి ఇష్టపడని భార్య పన్ను విరగొట్టిన ఓ ముస్లిం వ్యక్తి ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఫోటోలోని అమ్మాయి పన్ను విరిగినట్టు ఎడిట్ చేసి చూపించి, బుర్ఖా ధరించనందుకు ఒక ముస్లిం వ్యక్తి తన భార్య పన్ను విరగొట్టాడని షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే జంట యొక్క ఫోటో ‘Shutterstock’ వెబ్సైటులో దొరికింది. ఫోటోలో కనిపిస్తున్నది మిడిల్ ఈస్ట్ దేశానికి చెందిన అందమైన జంట అని అందులో తెలిపారు. ‘Shutterstock’ వెబ్సైటులో షేర్ చేసిన ఈ ఫోటోలో, ఆ అమ్మాయి పన్ను పోస్టులో చుపిస్తునట్టుగా విరిగి లేదు.

ఇదే ఫోటో ‘123RF’ వెబ్సైటులో కూడా లభించింది. ‘123RF’ వెబ్సైటులో షేర్ చేసిన ఫోటోలో కూడా ఆ అమ్మాయి పన్ను పోస్టులో చూపిస్తునట్టుగా విరిగిలేదు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఆ ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని చూపిస్తూ బుర్ఖా ధరించడానికి ఇష్టపడని భార్య పన్ను విరగొట్టిన ఓ ముస్లిం వ్యక్తి ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll