Fake News, Telugu
 

ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ మూడు కళ్ళతో పుట్టిన హిమాలయ యోగి ఫోటో అంటున్నారు

0

మూడు కళ్ళతో పుట్టిన హిమాలయ యోగి ఫోటో, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్  షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మూడు కళ్ళతో పుట్టిన హిమాలయ యోగి ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ వ్యక్తికి మూడు కళ్ళు ఉన్నట్టు ఫోటోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, మూడు కళ్ళు కలిగి ఉన్న హిమాలయ యోగి గురించి మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు. అంతేకాదు, ఈ మూడు కళ్ళ వ్యక్తికి సంబంధించిన మరొక ఫోటో లేదా వీడియో ఏది మాకు లభించలేదు. ఒకవేళ ప్రపంచంలో మూడు కళ్ళతో మనిషి పుట్టి వుంటే, అతని  గురించి ఇంటర్నెట్ లో తప్పకుండా ఫోటోలు గాని, వీడియోలు గాని లభించేవి. పోస్టులో షేర్ చేసిన ఫోటోని జాగ్రత్తగా గమనిస్తే, ఆ వ్యక్తి  మూడో కన్ను అతని కూడి కన్ను తో పోలి ఉండటాన్ని మనం చూడవచ్చు.

ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వార ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి కుడి కన్నుని కాపీ చేసి అతని ముఖం పై మూడు కళ్ళు ఉన్నట్టుగా ఈ ఫోటోని రూపొందించినట్టు తెలుస్తుంది. Photoshop ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా, ఆ వ్యక్తి మొహం పై మూడు, నాలుగు లేదా మనకు కావలిసినన్ని కళ్ళని అమర్చవచ్చు.

‘Photoshop’ సాఫ్ట్‌వేర్ లో ఈ ఎడిటెడ్ ఫోటోలని తయారుచేసిన విధానాన్ని క్రింద చూడవచ్చు.

ఇదివరకు, జర్మనీ దేశంలో మూడు కళ్ళతో పుట్టిన పాప అని ఇలాంటి ఫోటోషాప్ వీడియోని షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన ఫోటోని షేర్ చేస్తూ మూడు కళ్ళతో పుట్టిన హిమాలయ యోగి ఫోటో అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll