Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని పెట్టి, ‘మూడు కళ్ళతో జన్మించిన శిశువు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చెప్పిన విధంగా విదేశంలో వింతశిశువు జననం’ అని చెప్తూ, మూడు కన్నులతో ఉన్న ఒక శిశువు వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మూడు కన్నులతో జన్మించిన శిశువు వీడియో.

ఫాక్ట్ (నిజం): అది ఒక ఎడిట్ చేసిన వీడియో. ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఎడమ కన్నుని కాపీ చేసి, మూడో కన్నులా నుదిటిపై అమర్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియోలోని శిశువు గురించి వెతకగా, ఆ శిశువు అలా మూడు కళ్ళతో పుట్టినట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. నిజంగా, అలా ఒక శిశువు ఉండి ఉంటే, తన మూడు కళ్ళు చూపిస్తూ చాలా వీడియోలు ఇంటర్నెట్ లో ఉండేవి. అంతేకాదు, వీడియోలోని శిశువు యొక్క కళ్ళను సరిగ్గా గమనిస్తే, ఎడమ కన్ను మరియు నుదిటి మీద ఉన్న కన్ను ప్రతి ఫ్రేమ్ లో ఒకేలా ఉన్నట్టు తెలుస్తుంది.

ఎడిటింగ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఎడమ కన్నుని కాపీ చేసి, మూడో కన్నులా నుదిటిపై అమర్చారు. ‘ఆఫ్టర్ ఎఫెక్ట్స్’ సాఫ్ట్ వేర్ సహాయంతో ఆ శిశువుకు ఒక వీడియోలో రెండు కళ్ళు ఉన్నట్టు, ఇంకో వీడియోలో నాలుగు కళ్ళు ఉన్నట్టు FACTLY ఎడిట్ చేసిన వీడియోలను కింద చూడవొచ్చు.

మూడు, నాలుగు కాదు, ఎన్ని కావాలంటే అన్ని కళ్ళు సాఫ్ట్ వేర్ సహాయంతో పెట్టొచ్చు. ఆ ప్రక్రియ ‘ఆఫ్టర్ ఎఫెక్ట్స్’ సాఫ్ట్ వేర్ లో ఎలా ఉంటుందో కింద చూడవొచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన వీడియోని పెట్టి, ‘మూడు కళ్ళతో జన్మించిన శిశువు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll