Fake News, Telugu
 

డిజిటల్ గా రూపొందించిన న్యూస్ క్లిప్ ని పెట్టి ‘జనసేన అధికార ప్రతినిధికి దేహశుద్ధి’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

ఫేస్బుక్ లో కొంతమంది ‘జనసేన అధికార ప్రతినిధికి దేహశుద్ధి’ అని ఉన్న‘ఆంధ్ర జ్యోతి’ వార్తా పత్రిక న్యూస్ క్లిప్ ని పోస్టు చేస్తున్నారు. అందులో కుసుమపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక మహిళ తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని కొట్టినట్లుగా ఉంటుంది. ఆ న్యూస్ క్లిప్ లో ఒక మహిళ ఒక అతన్ని కొడుతున్న ఫోటో కూడా ఉంది.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జనసేన అధికార ప్రతినిధి కుసుమపూడి శ్రీనివాస్ ఒక మహిళ తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని కొట్టిందని ప్రచురించిన ‘ఆంధ్ర జ్యోతి’ వార్తా పత్రిక.

ఫాక్ట్ (నిజం): ‘జనసేన అధికార ప్రతినిధికి దేహశుద్ధి’ అని ‘ఆంధ్ర జ్యోతి’ వార్తా పత్రిక నవంబర్ 26న ప్రచురించినట్లుగా ఉన్న ఆ న్యూస్ క్లిప్ డిజిటల్ గా రూపొందించబడినది. అంతేకాదు, అందులో ఒక మహిళ ఒక వ్యక్తిని కొడుతున్న ఫోటో జంషెడ్పూర్ (ఝార్ఖండ్) లో జరిగిన ఒక సంఘటనది. జనసేన అధికార ప్రతినిధి కుసుమపూడి శ్రీనివాస్ ఒక మహిళ తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె అతన్ని కొట్టిందని ఎక్కడా కూడా సమాచారం లభించలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో ఉన్న న్యూస్ క్లిప్ ‘జనసేన అధికార ప్రతినిధికి దేహశుద్ధి’ అనే హెడ్ లైన్ తో ‘ఆంధ్ర జ్యోతి’ వార్తా పత్రిక నవంబర్ 26న ప్రచురించినట్లుగా ఉంది. ఆ కథనంలో కూకట్ పల్లి లో నివసిస్తున్న కుసుమపూడి శ్రీనివాస్ ఒక మహిళ తో అసభ్యంగా ప్రవర్తించడంతో కొంతమంది వ్యక్తులు అతన్ని కొట్టినట్లుగా ఉంది. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ‘ఆంధ్ర జ్యోతి’ వారి ఈ-పేపర్ ఎడిషన్ చూసినప్పుడు, ఆలాంటి న్యూస్ క్లిప్ ఎక్కడా లభించలేదు. ఆ న్యూస్ క్లిప్ లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో జంషెడ్పూర్ (ఝార్ఖండ్) లో ఒక నకిలీ ఏసీబీ అధికారి ఒక మహిళ నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నించినపుడు, ఆమె అతన్ని కొట్టడానికి సంబంధించినదని ‘India Today’ వారి కథనం ద్వారా తెలిసింది. గూగుల్ లో కూడా న్యూస్ క్లిప్ లో పేర్కొన్న విషయం గురించి వెతికినప్పుడు, అలాంటి ఘటన జరిగినట్లుగా సమాచారం ఏదీ లభించలేదు. కావున, ఆ న్యూస్ క్లిప్ డిజిటల్ గా రూపొందించినదని చెప్పొచ్చు.  పోస్టులో ఉన్న కామెంట్స్ విభాగంలో కూడా ఒక వ్యక్తి, ఆ న్యూస్ క్లిప్ ఎడిట్ చేసినదని పేర్కొని అందుకు సంబంధించిన కొలేజ్ ని పెట్టాడు.

చివరగా, డిజిటల్ గా రూపొందించిన న్యూస్ క్లిప్ ని పెట్టి ‘జనసేన అధికార ప్రతినిధికి దేహశుద్ధి’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll