Fake News, Telugu
 

‘ABN ఆంధ్రజ్యోతి’ పోస్టుని ఎడిట్ చేసి తీన్మార్ మల్లన్న తన వెనుక బీజేపీ ఉందని ఒప్పుకున్నాడని ప్రచారం చేస్తున్నారు

0

నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC స్థానానికి  ఇటీవల జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన తీన్మార్ మల్లన్న, తనకు  బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు మీడియాకి ఒప్పుకున్నారని సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ABN న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పోస్టు పెట్టిందని, ఆ పోస్టు యొక్క స్క్రీన్ షాట్ ని ఈ పోస్టులో షేర్ చేసారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తీన్మార్ మల్లన్నకి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు ABN న్యూస్ ఛానల్ పోస్టు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. 19 మార్చి 2021 నాడు తీన్మార్ మల్లన్నని ఇంటర్వ్యూ చేసిన వీడియోని ABN న్యూస్ ఛానల్ ‘నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు’ అనే టైటిల్ తో తమ ఫేస్బుక్ పేజిలో పబ్లిష్ చేసింది. తీన్మార్ మల్లన్న తనకు బీజేపీ సపోర్ట్ చేస్తునట్టు ఈ ఇంటర్వ్యూ లో ఎక్కడా తెలుపలేదు. ABN పబ్లిష్ చేసిన పోస్టు యొక్క టైటిల్ ని ఎడిట్ చేసి ఇలా షేర్ చేస్తున్నారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం ‘ABN ఆంధ్రజ్యోతి’ సోషల్ మీడియా అకౌంట్లో లలో వెతికితే, ఈ పోస్టు ‘ABN ఆంధ్రజ్యోతి’ ఫేస్బుక్ పేజిలో దొరికింది. ABN న్యూస్ ఛానల్ ఈ పోస్టుని ‘నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు’ అనే వివరణతో 20 మార్చి 2021 నాడు పబ్లిష్ చేసింది. ఈ పోస్టు యొక్క టైటిల్ ని ఎడిట్ చేసి ఇలా తప్పుగా షేర్ చేస్తున్నారని ఒరిజినల్ పోస్టు చూస్తే అర్ధమవుతుంది.

19 మార్చి 2021 నాడు తీన్మార్ మల్లన్నని ఇంటర్వ్యూ చేసిన వీడియోని ‘ABN’ న్యూస్ ఛానల్ ఈ ఒరిజినల్ పోస్టులో షేర్ చేసారు. తీన్మార్ మల్లన్న ఈ ఇంటర్వ్యూ లో తనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేసారు. తనకి బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్టు తీన్మార్ మల్లన్న ఈ ఇంటర్వ్యూ లో ఎక్కడా తెలుపలేదు.

2015 లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన MLC ఎన్నికలలో, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC స్థానానికి పోటీ చేసారు.

చివరగా, ఎడిట్ చేసిన ‘ABN ఆంధ్రజ్యోతి’ పోస్టుని చూపిస్తూ తీన్మార్ మల్లన్న తన వెనుక ఉండి నడిపించేది బీజేపీ అని మీడియాకు ఒప్పుకున్నట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll