Coronavirus Telugu, Fake News, Telugu
 

ఉడికించిన వెల్లులి నీటిని తాగడం COVID-19 కు నివారణ కాదు

0

తాజాగా ఉడికించిన  వెల్లులి  నీటి  ద్వారా కరోనా వైరస్ నశిస్తుందన్న వాదనతో  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఉడికించిన వెల్లుల్లి నీరు కరోనావైరస్ ను నయం చేస్తుంది.

ఫాక్ట్ (నిజం): ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లుల్లికి కొన్ని యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉండవచ్చని ఒక వివరణ జారీ చేసింది. అయితే  కరోనా వైరస్ను నయం చేస్తుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని భారత ప్రభుత్వ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ట్వీట్ చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్నట్లు ఎనిమిది (8) వెల్లులి రేఖలు మరియు పన్నెండు (12) లవంగాలను కొద్దిగా దంచి ఏడు (7) కప్పుల నీరు పోసి మరిగించి ఆ మిశ్రమాన్ని తిని  మరిగిన నీటిలో మూడు (3) స్పూన్లు పసుపు కలిపి త్రాగడం అనే క్లెయిమ్ కి సంబంధించిన సమాచారం కోసం గూగుల్ లో వెతికితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన వెబ్‌సైట్‌లో వెల్లుల్లికి సంబంధించి ఇప్పటికే ఒక వివరణ విడుదల చేసింది. “వెల్లుల్లి తినడం ప్రజలను కరోనావైరస్ నుండి రక్షిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు” అని స్పష్టం చేసింది. అదే వెబ్‌సైట్‌లో “ఈ రోజు వరకు, కరోనావైరస్ నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఎటువంటి మందును సిఫార్సు చేయలేదని” చదవవచ్చు. పసుపుకు యాంటీ ఇన్ఫలమేటరి మరియు లవంగాలకి యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్నప్పటికీ, ఈ మిశ్రమం COVID-19 ను నయం చేస్తుందని నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

వైరల్ అవుతున్నది ఫేక్ మెసేజ్ అని, ఉడికించిన వెల్లులి నీటిని తాగడం COVID-19 కు నివారణ కాదని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా ట్వీట్ చేసారు.

మొత్తానికి, ‘వెల్లుల్లి ఆరోగ్యకరమైనదే కానీ, కరోనావైరస్ నుండి ప్రజలను రక్షిస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు’.

Share.

About Author

Comments are closed.

scroll