Fake News, Telugu
 

ఎర్రటి ద్రవాన్ని విడుదల చేసే డ్రాగన్ బ్లడ్ చెట్లు ప్రపంచంలో అనేక చోట్ల పెరుగుతాయి

0

ఒక చెట్టుని కత్తితో కోసినప్పుడు ఎర్రటి ద్రవం రావడాన్ని చూపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అయితే ఈ చెట్టు కేవలం యెమెన్ దేశంలో ఉంటుందని, ఆ ఎర్రటి పదార్ధం రక్తం అని ఈ వీడియో వివరణలో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కత్తితో కోసినప్పుడు రక్తం కార్చే చెట్టు యెమెన్ దేశంలో మాత్రమే ఉంటుంది.

ఫాక్ట్: యెమెన్ దేశంలోని సొకొట్రా దీవులలో ఈ డ్రాగన్ బ్లడ్ చెట్లు ఆవిర్భవించినప్పటికీ, ఈ జాతి చెట్లు, మరికొన్ని ఉప జాతులు ప్రపంచంలోని అనేక చోట్ల పెరుగుతాయి. ఇక ఈ చెట్టు బెరడుని కోసినప్పుడు వచ్చేది రక్తం కాదు, అది చెట్టు రసం (sap). దీని అనేక ఔషధాల, రంగుల తయారీలో వాడుతారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ చెట్టు గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీని పేరు డ్రాగన్ బ్లడ్ ట్రీ (Dragon Blood Tree) అని, ఇవి యెమెన్ దేశానికి చెందిన సొకొట్రా దీవులలో ఆవిర్భవించాయని తెలిసింది. ఈ చెట్టు బెరడుని కోసినప్పుడు వచ్చే ఎర్రటి రసం(Sap) వంటి ద్రవం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. కాకపోతే, ఇది రక్తం కాదు. ఈ రసాన్ని అనేక ఔషధాలు మరియు రంగుల తయారీలో వినియోగిస్తారు.

ఈ చెట్టు యెమెన్‌లోనే కాకుండా ఇతర దేశాలలో కూడా పెరుగుతుంది. ఇక భారత్‌లో కూడా ఇదే జాతికి చెందిన మరొక రకం డ్రాగన్ బ్లడ్ చెట్లను గుర్తించారు.

ఇక ఇటువంటి ఎర్రటి ద్రవాన్ని విడుదల చేసే ఇతర జాతుల చెట్లు కూడా ప్రపంచంలో అనేకం ఉన్నాయి. సంబంధిత వివరాలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, కత్తితో గాయం చేసినప్పుడు ఎర్రటి ద్రవాన్ని విడుదల చేసే డ్రాగన్ బ్లడ్ ట్రీ వంటి చెట్లు యెమెన్ దేశంలోనే కాకుండా అనేక చోట్ల పెరుగుతాయి.

Share.

About Author

Comments are closed.

scroll