Fake News, Telugu
 

డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను ‘అమెరికా గాట్ టాలెంట్’ షోలో ఓ భారతీయుడు చరిత్ర సృష్టించాడు అంటూ షేర్ చేస్తున్నారు

0

‘అమెరికా గాట్ టాలెంట్’ షోలో ఓ భారతీయుడు చరిత్ర సృష్టించాడు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. వీడియోలో ఒక వ్యక్తి మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ న్యాయనిర్ణేతలను ఆశ్చర్యపరచడం చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో ఓ భారతీయుడు మ్యాజిక్ ట్రిక్స్ ప్రదర్శించిన వీడియో.

ఫాక్ట్(నిజం):  ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ & ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ వంటి పలు టాలెంట్ షోలలోని దృశ్యాలను డిజిటల్‌గా జోడించి ఈ వీడియోను రూపొందించారు. అసలు వీడియోలో వ్యక్తి ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్నట్టు ఎలాంటి సమాచారం లేదు. వైరల్ వీడియోలో చూపించిన మ్యాజిక్ ట్రిక్స్ కూడా గ్రాఫిక్స్ ద్వారా చేసినవే.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియోలోని దృశ్యాలు ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ & ‘బ్రిటన్ గాట్ టాలెంట్’ వంటి టాలెంట్ షోలాగే ఉన్నప్పటికీ ఈ వీడియోను డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించారు. ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఒక్కోసారి ఒక్కో జడ్జి ఉండడం, ఒకే జడ్జి వేరువేరు కాస్ట్యూమ్‌లలో కనిపించడం చూడొచ్చు. దీన్నిబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోను పలు టాలెంట్ షోల దృశ్యాలను డిజిటల్‌గా జోడించి రూపొందించినట్టు అర్ధమవుతుంది.

ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2020లో ప్రసారమైన  ‘బ్రిటన్స్ గాట్ టాలెంట్’ ఎపిసోడ్ ఒకటి మాకు కనిపించింది. ఈ ఎపిసోడ్‌లో భారత్‌కు చెందిన ఒక డాన్స్ గ్రూప్ ప్రదర్శనకు షో న్యాయనిర్ణేతలు ఆశ్చర్యపోవడం చూడొచ్చు (ఇక్కడ). ఐతే ఇవే దృశ్యాలు ప్రస్తుతం షేర్ అవుతన్న వీడియోలో 4:01 టైం స్టాంప్ వద్ద చూడొచ్చు.

అలాగే 2023లో ప్రసారం అయిన ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో ఒక గ్రూప్ ప్రదర్శనకు న్యాయనిర్ణేత సోఫియా వెర్గారా ఇచ్చిన రియాక్షన్ దృశ్యాలు ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలో కూడా చూడొచ్చు. దీన్నిబట్టి పలు టాలెంట్ షోలలోని దృశ్యాలను, ఈ వ్యక్తి మ్యాజిక్ ట్రిక్స్ చేస్తున్న దృశ్యాలకు డిజిటల్‌గా జోడించి రూపొందించారని స్పష్టమవుతుంది. 

అసలు వీడియోలో వ్యక్తి ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్నట్టు ఎలాంటి సమాచారం లేదు. వైరల్ వీడియోలో చూపించిన మ్యాజిక్ ట్రిక్స్ కూడా గ్రాఫిక్స్ ద్వారా చేసినవే. ఒకేలాంటి వ్యక్తిని సృష్టించడం లేదా తనను తాను రెండు ముక్కలుగా కత్తిరించుకోవడం వంటి ట్రిక్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఈ వీడియో మొత్తం డిజిటల్‌గా ఎడిట్ చేసి రూపొందించినట్టు అర్థంచేసుకోవచ్చు. 

చివరగా, డిజిటల్‌గా ఎడిట్ చేసిన వీడియోను ‘అమెరికా గాట్ టాలెంట్’ షోలో ఓ భారతీయుడు చరిత్ర సృష్టించాడు అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll