Fake News, Telugu
 

బీహార్ లో చనిపోయింది ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ కాదు, ‘జ్యోతి కుమారి’ పేరుతో ఉన్న మరొక యువతి

0

మూడు ఫొటోలను ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ మరణించిందని చెప్తున్నారు. జ్యోతి కుమారి పాశ్వాన్ ని కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారని పోస్ట్‌లో పేర్కొన్నారు. జ్యోతి కుమారి పాశ్వాన్ COVID-19 లాక్ డౌన్  సమయంలో అనారోగ్యంతో ఉన్న తన తండ్రి ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుండి దర్భాంగాకు ఏడు రోజులలో 1,200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం చేసింది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ మరణించింది.

ఫాక్ట్ (నిజం): బీహార్‌లోని పటోరి గ్రామంలో గ్రామంలో ‘జ్యోతి కుమారి’ అనే యువతి హత్యకి గురైంది. కానీ, ఆమె ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ కాదు. ‘దర్భాంగా’ పోలీసులు ‘సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి పాశ్వాన్ మరణించిందనే వార్తలు ఫేక్ అని, ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కావున ఈ పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పు.

జ్యోతి కుమారి పాశ్వాన్ COVID-19 లాక్ డౌన్  సమయంలో అనారోగ్యంతో ఉన్న తన తండ్రి ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుండి బీహార్ లోని దర్భాంగాకు ఏడు రోజులలో 1,200 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం చేసింది. అమెరికా రాష్ట్రపతి డోనాల్డ్ ట్రంప్ కూతురు  ఇవంకా ట్రంప్ కూడా ఆమె ని అభినందిస్తూ ట్వీట్ చేసింది. 

పోస్ట్‌లో చెప్పిన సంఘటన గురించి మేము గూగుల్‌లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, బీహార్‌లోని పటోరి గ్రామంలో ఒక సంఘటన జరిగిందని వార్తా కథనాలు లభించాయి. ‘Times of India’ కథనం ప్రకారం, అర్జున్ మిశ్రా అనే వ్యక్తి తన పండ్ల తోట నుండి జ్యోతి కుమారి అనే యువతి మామిడి కాయలు దొంగిలిస్తూ పట్టుబడడంతో అతను ఆమెని చంపాడు. 

‘దర్భాంగా’ పోలీసులు ఒక ఫేస్బుక్ పోస్టు పెట్టి ‘సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి పాశ్వాన్ మరణించిందనే వార్తలు ఫేక్ అని, ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిపారు. అంతేకాదు, పోస్టుమార్టం ప్రకారం పటోరి గ్రామానికి చెందిన జ్యోతి కుమారి మరణించింది విద్యుత్ఘాతం వల్ల అని తెలిపారు. 

సుప్రసిద్ధ NGO ‘నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’ కూడా ఫేస్బుక్ లో ఒక పోస్టు పెట్టి, ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ మృతి చెందిందంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేశాయి.

చివరిగా, బీహార్ లో చనిపోయింది ‘సైకిల్ గర్ల్’ జ్యోతి కుమారి పాశ్వాన్ కాదు, ‘జ్యోతి కుమారి’ పేరుతో ఉన్న మరొక యువతి.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll