Fake News, Telugu
 

భారత్ కు మద్దతుగా అమెరికా తమ సైన్యాన్ని ఇంకా పంపిచలేదు

0

భారత దేశానికి మద్దతుగా అమెరికా తమ సైన్యాన్ని పంపిచినట్టుగా చెప్తూ ఒక వీడియో అనేక సామజిక మాద్యమాల్లో చెక్కర్లు కొడుతున్నది. అందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: భారత్ కు మద్దతుగా అమెరికా తమ సైన్యాన్ని పంపించింది.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఎయిర్ సోర్స్ మిలిటరీ అనే యూట్యూబ్ ఛానల్ లో వీడియో ఒకేలా ఉన్నాయి. ఐతే ఎయిర్ సోర్స్ మిలిటరీ ఛానల్ లో ఆ వీడియో అప్లోడ్ చేసిన తేదీ మాత్రం 26 మే 2014 అని ఉంది. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వీడియో పాత వీడియో అని నిర్ధారించవచ్చు. ఆ ఛానల్ లో ఇచ్చిన వివరణ ప్రకారం అది 3 మే 2013న అమెరికా, భారత సైనికుల సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ గా ద్రువీకరించొచ్చు. కావున ఆ పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు

ఆ వీడియో గురించి మేము యూట్యూబ్ లో వెతకగా ఎయిర్ సోర్స్ మిలిటరీ అనే యూట్యూబ్ ఛానల్ లో ఆ వీడియో కనిపించింది. ఐతే ఆ వీడియో అప్లోడ్ చేసిన తేదీ మాత్రం 26 మే 2014 అని ఉంది. దీన్నిబట్టి వైరల్ అవుతున్న వీడియో పాత వీడియో అని నిర్ధారించవచ్చు.

ఇంకా ఈ వీడియో గురించి లోతుగా అన్వేషించగా ఎయిర్ సోర్స్ మిలిటరీ ఛానల్ లో ఇచ్చిన వివరణ ప్రకారం ఆ వీడియో లో ఉన్నది 50th ఇండిపెండెంట్ పారా బ్రిగేడ్ మరియు 82nd ఎయిర్ బొర్నె డివిజన్ యొక్క 3rd స్క్వాడ్రన్ 73rd కావలరీ రెజిమెంట్ అని ఉంది. ఈ వివరాల గురించి మేము వెతకగా అమెరికన్ ఆర్మీ వెబ్సైటు లో దీనికి సంబంధించిన వివరాలు మాకు దొరికాయి. ఈ వెబ్సైటు లో ఉన్న వివరాల ప్రకారం అమెరికా, భారత సైన్యం లోని పైన పేర్కొన్న రెజిమెంట్స్ 03 మే 2013న అమెరికా లో నార్త్ కరోలినా రాష్ట్రం లోని ఫోర్ట్ బ్రాగ్ మిలిటరీ ఇన్స్టలేషన్ లో సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగినట్టుగా ఉంది. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కి సంబంధించిన మరిన్ని ఫోటోలు ఇక్కడ చుడ్డొచ్చు. దీన్నిబట్టి ఈ వీడియో ఇప్పటిది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

రెండు దేశాల సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి సాధారణంగా జరిగేవే. భారత ఆర్మీ చాల దేశాల ఆర్మీతో కలిసి మిలిటరీ ఎక్సర్సైజ్ లు నిర్వహిస్తూనే ఉంటుంది. భారత సైన్యం వివిధ దేశాల సైన్యంతో కలిసి నిర్వహించిన మిలిటరీ ఎక్సర్సైజ్ ల గురించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలోని డిఫెన్సె డిపార్ట్మెంట్ వెబ్సైటు లో పొందుపరిచిన వార్షిక రిపోర్ట్స్ లోని ‘డిఫెన్స్ కోఆపరేషన్ విత్ ఫారిన్ కంట్రీస్’ సెక్షన్ లో చూడవచ్చు. 2013-2014కు సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ చూడవచ్చు.

ఐతే ఇటీవలే అమెరికా సెక్రటరీ అఫ్ స్టేట్ బ్రస్సెల్స్ ఫోరమ్ లో మాట్లాడుతూ భారత్ మరియు చైనాకు మధ్య  సరిహద్దులో ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో అవసరమైతే అమెరికా సైనికుల్ని భారత్ కు మద్దతుగా పంపుతామని చెప్పాడు, ఐతే నిజంగా అమెరికా సైన్యం భారత్ కు మద్దతుగా వచ్చినట్టు ఎక్కడా సమాచారం లేదు.

క్లుప్తంగా చెప్పాలంటే 2013లో అమెరికా, భారత సైనికుల సంయుక్త మిలిటరీ ఎక్సర్సైజ్ వీడియోను తాజాగా భారత్ కు మద్దతుగా అమెరికా తమ సైన్యాన్ని పంపించింది అని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll