Fake News, Telugu
 

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మూడేళ్ళ బాలికని ఉత్తరప్రదేశ్ లో అత్యాచారం చేసి చంపినట్టుగా ప్రచారం చస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలో మూడేళ్ళ బాలికని అత్యాచారం చేసి చంపారు, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోస్టులోని ఆ క్లెయిమ్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

    ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలో మూడేళ్ళ బాలికను అత్యాచారం చేసి చంపిన ఘటన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న మూడేళ్ళ బాలిక చనిపోయింది రోడ్డు ఆక్సిడెంట్ కారణంగా, అత్యాచారం వలన కాదు. అక్రాబాద్ నగరానికి చెందిన ఈ బాలిక ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు మా విశ్లేషణలో తేలింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, పోస్టులోని అదే క్లెయిమ్ చేస్తూ ఒక యూసర్ పెట్టిన పోస్టుకి ఆలీఘర్ పోలీస్ సమాధానం ఇస్తూ పెట్టిన ట్వీట్ దొరికింది. అక్రాబాద్ నగరానికి చెందిన వీడియోలోని మూడేళ్ళ బాలిక ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ఆలీఘర్ పోలీస్ తమ ట్వీట్ లో స్పష్టం చేసారు. ఈ వీడియోని కొంత మంది అత్యాచార ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుగా షేర్  చేస్తున్నారని ఆలీఘర్ పోలీస్ వారు హెచ్చరిస్తూ ట్వీట్ పెట్టారు.

ఈ ఘటనకి సంబంధించి ఆలీఘర్ జిల్లా SP ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆలీఘర్ జిల్లాలోని అక్రాబాద్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ళ బాలిక మరణించినట్టు ఆలీఘర్ జిల్లా SP వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటన ’04 నవంబర్ 2020’ నాడు చోటుచేసుకున్నట్టు వీడియోలో తెలిపారు. తన కూతురు రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని బాలిక తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ ని ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా వీడియోలో కనిపిస్తున్న బాలిక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బాలిక వీడియోని చూపిస్తూ ఉత్తరప్రదేశ్ లో మూడేళ్ళ బాలికని అత్యాచారం చేసి చంపినట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll