Fake News, Telugu
 

‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదు.

0

‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 నుండి 18 ఏళ్ళ ఆడపిల్లలకు, తండ్రి ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు దాటకుంటే, ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు ఖాతాలో వేస్తుందని, తొందరగా అప్లై చేసుకోమని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు.. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5 నుండి 18 ఏళ్ళ ఆడపిల్లలకు, తండ్రి ఆదాయం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు దాటకుంటే, ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు ఇస్తుంది.

ఫాక్ట్ (నిజం): ఆ పేరుతో ఎటువంటి ప్రభుత్వ పథకం లేదు. ఆ పథకం గురించి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వారు కూడా అవి ఫేక్ మెసేజ్లు అని, ఆ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదని ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన పథకం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, అటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉన్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. ఆ పథకం గురించి ఎక్కడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పలేదు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్సైటులో ఆడవారికి సంబంధించి వేరే పథకాలు ఉన్నాయి, కానీ పోస్ట్ లో చెప్పినట్టు ప్రతి సంవత్సరం 24 వేల రూపాయలు ఇచ్చే ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ మాత్రం లేదు. ఆడవారికి సంబంధించిన పథకాలను కొన్ని  ఇక్కడ చూడవొచ్చు.

బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసే ప్రభుత్వ ‘డీబీటీ’ పథకాల లిస్టులో కూడా ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పథకం లేదు.

అంతేకాదు, ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరు మీద వివిధ పోస్టులు వైరల్ అవ్వడంతో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వారు కూడా అవి ఫేక్ మెసేజ్లు అని, ఆ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదని ట్వీట్ చేసారు.

చివరగా, ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll