Fake News, Telugu
 

సిపిఐ లీడర్ ‘ఆని రాజా’ పాత ఫోటో పెట్టి JNU లో శిక్షణ పొందుతున్న ముసలి విధ్యార్ధిని అని షేర్ చేస్తున్నారు

1

ఒక ముసలావిడని కొంతమంది పోలీసులు వ్యాన్ ఎక్కిస్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి,  ఆమె జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ విద్యార్థిని అని పేర్కొంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలోని ముసలావిడ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ లో స్టూడెంట్.    

ఫాక్ట్ (నిజం): ఫొటోలో ఉన్నది సిపిఐ లీడర్ ‘ఆని రాజా’. మే 2019 లో లైంగిక వేధింపుల కేసులో సీజేఐ రంజన్ గొగోయ్ కి సుప్రీమ్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు జరిగిన నిరసనలో ఆమె పాల్గొన్నప్పుడు తీసిన ఫోటో అది. కావున, పోస్టులో చెప్పింది తప్పు

పోస్టులో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో ‘Mid-Day’ వారి ఒక కథనం లో అదే ఇమేజ్ ఉంది. దాని ద్వారా మే 2019 లో లైంగిక వేధింపుల కేసులో సీజేఐ రంజన్ గొగోయ్ కి సుప్రీమ్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు నిరసనలు జరిగాయని, అందులో  ‘ఆని రాజా’ అనే కార్యకర్త పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. గూగుల్ లో ‘ఆని రాజా’ కి సంబంధించిన ఫోటోలుచూసినప్పుడు, పోస్టులోని ఫొటోలో ఉన్నది ఆమె అని తెలుసుకోవచ్చు. ‘ఆని రాజా’ కి సంబంధించిన సమాచారం కోసం వెతికినప్పుడు, ఆమె సిపిఐ పార్టీ లీడర్ అని తెలిసింది.

చివరగా,  సి.పి.ఐ. లీడర్ ‘ఆని రాజా’ పాత ఫోటోని పెట్టి, అందులో ఉన్న ముసలావిడ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ స్టూడెంట్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll