Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

5G మొబైల్ నెట్వర్క్ వల్ల కరోనా వ్యాప్తి చెందదు; బిల్ గేట్స్ దగ్గర ఉన్న పేటెంట్ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనాకి సంబంధించిన వాక్సిన్ ది కాదు

0

కోవిడ్ అనేది పెద్ద కార్పొరేట్ సంస్థలు సృష్టించిన ఒక కుట్ర అని చెప్తూ, ఈ వాదనకి మద్దతుగా చైనాలోని వుహన్ లో 5G వల్లే జనాలు చనిపోయారని, బిల్ గేట్స్ కి కరోనా లాంటి ఒక మహమ్మారి రాబోతుందని ముందే తెలుసనీ, బిల్ గేట్స్ దగ్గర కరోనా కి సంబంధించిన వాక్సిన్ ఉందని, ఇంకా ఇలాంటి చాలా క్లెయిమ్స్ చేస్తువున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంతవరకు నిజముందో తెలుసుకుంధాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు

క్లెయిమ్: చైనాలోని వుహన్ లో 5G నెట్వర్క్ మొదలు పెట్టడం వల్లే చాలా మంది చనిపోయారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ మరియు హై ఫ్రీక్వెన్సీ 5G కలిసి ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ కరోనా ఎఫెక్ట్’ సంభవించింది.

ఫాక్ట్(నిజం): 5Gలో మిగతా టెక్నాలజీలో వాడిన ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వాడతారు, సాధారణంగా ఎక్కవ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి శరీరంలోని టిష్యూలోకి తక్కువ చోచ్చుక పోతుంది. SARS-CoV-2 (కోవిడ్-19) మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది, ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కాదు. ‘ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్’ చేప్తున్న దాని ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల స్వల్పంగా శరీర వేడి పెరుగుతుంది కాని ఆ వేడి ఊపిరి తిత్తులను తాకదు. WHO కూడా ఇదే చెప్తుంది. కావున పోస్టు ద్వారా చెప్తుంది తప్పు.

5G నెట్వర్క్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదమన్న వాదనలు కోవిడ్ కన్నా చాలా ముందునుండే వినిపిస్తున్నాయి. ఐతే కోవిడ్ మొదలైన తరవాత ఇలాంటి వార్తల వ్యాప్తి చాలా పెరిగింది. కాని కోవిడ్ కి ముందు కూడా సెల్ ఫోన్, వైఫై మొదలైన టెక్నాలజీస్ వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వార్తలు కూడా వచ్చాయి. ప్రపంచంలో 5G నెట్వర్క్ కొన్ని ప్రాంతాల్లోనే ప్రారంభించారు అందులో వుహన్ ఒకటి. ఐతే వుహన్ కి సంబంధించిన కేస్ స్టడీస్ ప్రకారం వుహన్ కి వెళ్ళకుండా, వుహన్ లో ఉన్నవారితో కాంటాక్ట్ అయిన వారు కోవిడ్ బారిన పడ్డారు, ఎందుకంటే SARS-CoV-2 (కోవిడ్-19) మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందుతుంది, ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల కాదు. దీన్నిబట్టి 5G వల్ల కోవిడ్ వ్యాప్తి చెందితుంది అన్న వాదనలో నిజం లేదని, 5G నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా కోవిడ్ వ్యాప్తిచెందుతుందని చెప్పొచ్చు.

ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్’ చేప్తున్న దాని ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల స్వల్పంగా శరీర వేడి పెరుగుతుంది కాని ఆ వేడి ఊపిరి తిత్తులను తాకదు. దీన్నిబట్టి 5G మనిషి శరీరంలోని సెల్స్ ని నాశనం చేస్తుంది అన్న వాదనలో నిజం లేదని చెప్పొచ్చు.

WHO కూడా ఇదే చెప్తుంది, ఐతే వీరు చెప్తున్న దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న Radiofrequency exposure levels వల్ల శరీర ఉష్ణోగ్రత నామమాత్రంగానే పెరుగుతుంది, కాని overall exposure అంతర్జాతీయ నియమాలకు లోబడినప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదు. 5Gలో మిగతా టెక్నాలజీలో వాడిన ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ వాడతారు, సాధారణంగా ఎక్కవ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ మనిషి శరీరంలోని టిష్యూలోకి తక్కువ చొచ్చుక పోతుంది. కోవిడ్ కి సంబంధించి వ్యాప్తిలో ఉన్న కొన్ని అపోహలను పోగొట్టడానికి WHO వెబ్సైటు ఉంచిన సమాచారంలో వైరస్ రేడియో వేవ్స్ లేదా మొబైల్ నెట్వర్క్స్ ద్వారా ప్రయానించదని కావున 5G మొబైల్ నెట్వర్క్ వల్ల కోవిడ్ వ్యాప్తి చెందదని స్పష్టంగా చెప్పింది.

క్లెయిమ్ 2: బిల్ గేట్స్ కి కరోనా లాంటి ఒక మహమ్మారి సంభవిస్తుందని ముందే తెలుసు. బిల్ గేట్స్ దగ్గర కరోనాకి సంభందించిన వాక్సిన్ పేటెంట్ ఉంది.

ఫాక్ట్(నిజం): సాధారణ జలుబు లేక SARS మొదలైన అనేక వైరస్ లను కరోనా వైరస్ అని అంటారు, బిల్ గేట్స్ దగ్గర ఉన్నది ఇలాంటి ఒక వైరస్ కి సంబంధించిన పేటెంట్, ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనాకి సంభందించిన పేటెంట్ కాదు. కావున పోస్టులో చెప్తుంది తప్పు.

కరోనా లాంటి ఒక మహమ్మారి వ్యాప్తించినప్పుడు ఎలా స్పందించాలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఒక సిములేషన్ ఈవెంట్ (Event201), బిల్ గేట్స్ కరోనాని సృష్టించాడని, కరోనా గురించి బిల్ గేట్స్ కి ముందే తెలుసనీ,  బిల్ గేట్స్ కరోనా వాక్సిన్ కి పేటెంట్ తీసుకున్నాడన్న మొదలైన తప్పుడు వార్తలకి దారితీసింది. Event 201కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు.

బిల్ గేట్స్ దగ్గర కరోనా వైరస్ కి సంబందించిన వాక్సిన్ కి పేటెంట్ ఉందన్న వార్త నిజమైనప్పటికి, ఆ వాక్సిన్ ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్ కి సంబంధించింది కాదు. సాధారణ జలుబు లేక SARS మొదలైన అనేక వైరస్ లను కరోనా వైరస్ అని అంటారు, బిల్ గేట్స్ దగ్గర ఉన్నది ఇలాంటి ఒక వైరస్ కి సంబంధించిన పేటెంట్.

చివరగా, తప్పుడు సమాచారాన్ని ఆధారలుగా చూపిస్తూ కరోనా అనేది పెద్ద కార్పొరేట్ సంస్థలు సృష్టించిన ఒక కుట్ర అని చెప్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll