Fake News, Telugu
 

కాంగ్రెస్ పార్టీ తమ 2018 తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింల కోసం ప్రత్యేక ప్రభుత్వ ఆసుపత్రులని నిర్మిస్తామని ప్రకటించలేదు

0

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతోందని తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 ఆసుపత్రులని ముస్లింలకు మాత్రమే వైద్యం అందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించింది, అంటూ ‘రిపబ్లిక్ టివీ’ న్యూస్ బులిటెన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. హిందువులు అత్యవసర పరిస్థుతులలో వైద్యం కోసం వచ్చినా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయరని, ముస్లిం డాక్టర్లకు మాత్రమే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలలో ఉద్యగాలు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ప్రమాణం చేసిందని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతోందని తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11 ఆసుపత్రులని ముస్లింలకు మాత్రమే వైద్యం అందిస్తామని ప్రకటించింది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ‘రిపబ్లిక్ టివీ’ న్యూస్ బులిటెన్లో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి చర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మైనారిటీలు కేంద్రీకృత ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని వాగ్ధానం చేసింది. కేవలం ముస్లింల కోసం మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో ప్రకటించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఈ వీడియోని ‘రిపబ్లిక్ టివీ’ న్యూస్ ఛానల్ 11 డిసెంబర్ 2018 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో షేర్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో ‘రిపబ్లిక్ టివీ’ ఛానల్ హెడ్ అర్ణబ్ గోస్వామి మాట్లాడుతుంది 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి అని ఆర్టికల్ ద్వారా స్పష్టమయ్యింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తమ మేనిఫెస్టోని 27 నవంబర్ 2018 నాడు రిలీజ్ చేసింది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని ఇక్కడ చూడవచ్చు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మైనారిటీల అభ్యున్నతి కోసం ముస్లింలు, క్రైస్తవులకు మరియు ఇతర మైనారిటి వర్గాల కోసం ప్రత్యేక ఫైనాన్సు కార్పొరేషన్లని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద ప్రకటించిన ఒక వాగ్ధనంలో, మైనారిటీలు ఎక్కువగా ప్రాంతాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అన్ని మైనారిటీలను ఉద్దేశించి చేసిన ఈ వాగ్ధానాన్ని, మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కింద పాయింట్లలో జత చేయడంతో, కేవలం ముస్లింల కొరకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తున్నట్టు పలు వార్తా సంస్థలు తప్పుగా రిపోర్ట్ చేసాయి. ముస్లింల కోసం మాత్రమే ప్రత్యేక ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో ఎక్కడా ప్రకటించలేదు.

2018 తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలని మినహాయించి మసీదులు, చర్చిలకు మరియు ఇతర మత ప్రార్ధన స్థలాలకు ఉచిత విద్యుత్తు అందిస్తామని ప్రకటించిందని బీజేపి ప్రముఖ నేత అమిత్ షా ఒక ఎన్నికల బహిరంగ సభలో పేర్కొన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తమని తెలుపుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టి 02 డిసెంబర్ 2018 నాడు ఒక ట్వీట్ పెట్టింది.  “కాంగ్రెస్ భావజాలం అందరినీ కలుపుకొని ఉంది. మా మేనిఫెస్టో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు ఇతర మైనారిటీలను సమానంగా కవర్ చేసింది. ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే ముందు మా మానిఫెస్టోను పూర్తిగా చదవండి”, అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టి ట్వీట్ పెట్టింది.  

చివరగా, 2018 తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం ప్రత్యేక ప్రభుత్వ ఆసుపత్రులని నిర్మిస్తామని ప్రకటించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll