Fake News, Telugu
 

కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో కేవలం మైనారిటీలకే కాకుండా SC & ST విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామని పేర్కొంది

0

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కేవలం ముస్లిం విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యకు స్కాలర్షిప్స్ అందిస్తామని పేర్కొందని చెప్తున్న వీడియో ఒకటి ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మౌలానా ఆజాద్ స్కాలర్షిప్స్ పేరుతో వీటిని అందించనుందని తెలిపినట్టు చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కేవలం ముస్లిం విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్యకు స్కాలర్షిప్స్ అందిస్తామని పేర్కొంది.

ఫాక్ట్(నిజం): కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో కేవలం మైనారిటీలకే కాకుండా SC & ST విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామని పేర్కొంది. అదేవిధంగా OBC, SC & ST విద్యార్థుల ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌ల నిధులను రెట్టింపు చేస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ‘న్యాయపత్ర’ పేరుతో మేనిఫెస్టోను ఇటీవల విడుదల చేసింది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది (ఇక్కడ & ఇక్కడ). ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమ సూత్రాలపై ఈ మేనిఫెస్టో రూపొందించారు.

ఈ మేనిఫెస్టోలో మైనారిటీలకు కూడా కొన్ని వాగ్దానాలు చేసింది. దేశంలోని మైనారిటీలకు తమ పర్సనల్ చట్టాలకు సంబంధించి స్వేఛ్చ ఉండేలా చూస్తామని తెలిపింది. ఇదే క్రమంలో విదేశాలలో చదువుకోవాలకునే మైనారిటీ విద్యార్థులకు మౌలానా ఆజాద్ స్కాలర్‌షిప్‌లను పునరుద్ధరించి, ఈ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను పెంచుతామని పేర్కొంది.

ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తలో చెప్తున్నట్టు ఈ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే కాకుండా SC & ST విద్యార్థులకు కూడా విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లు అందిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.  అలాగే వారు Ph. D చేసేందుకు స్కాలర్‌షిప్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని పేర్కొంది.

అదేవిధంగా OBC, SC & ST విద్యార్థుల ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌ల నిధులను రెట్టింపు చేస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో పేర్కొంది. దీన్నిబట్టి కాంగ్రెస్ కేవలం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందింస్తామని హామీ ఇచ్చిందని చేస్తున్న వాదనలో నిజం లేదని స్పష్టమవుతుంది.

చివరగా, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో కేవలం మైనారిటీలకే కాకుండా SC & ST విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తామని పేర్కొంది.

Share.

About Author

Comments are closed.

scroll