‘ప్రజలకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దేశంలొ 3376 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు’ అని చెప్తూ, ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వం కొత్తగా 3376 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయట్లేదని FACTLY విశ్లేషణలో తేలింది. కేంద్ర ఆర్ధిక మంత్రి ఇచ్చిన వివరాలలో ‘3376 industrial parks/estates/SEZs in 5 lakh hectares mapped on Industrial Information System (IIS)’ (5 లక్ష హెక్టార్లలో ఉన్న 3376 ఇండస్ట్రియల్ పార్కులు/ఎస్టేట్లు/సెజ్లలను ఇండస్ట్రియల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (IIS) లో మ్యాప్ చేయబడ్డాయి) అని ఉన్నట్టు ఇక్కడ చదవొచ్చు. అదే విషయాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్తున్న వీడియో ఇక్కడ చూడవొచ్చు. ఎక్కడా కూడా కొత్తగా 3376 ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు తను తెలపలేదు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి అని మాత్రం చెప్పింది. అంతేకాదు, 3376 ఇండస్ట్రియల్ ప్రదేశాలు కొత్తగా ఏమీ మ్యాప్ చేయబడలేదు, లోక్ సభలో 05 ఫిబ్రవరి 2020 న ఒక ప్రశ్నకి బదులిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంలో కూడా ఇండస్ట్రియల్ ప్రదేశాల మ్యాపింగ్ కి సంబంధించిన వివరాలు చూడవొచ్చు. IIS డాష్ బోర్డు ని ఇక్కడ చూడవొచ్చు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. PIB డాక్యుమెంట్ – https://static.pib.gov.in/WriteReadData/userfiles/AatmaNirbhar Bharat Full Presentation Part 4 16-5-2020.pdf
2. Times Now ట్వీట్ – https://twitter.com/TimesNow/status/1261611095757737984
3. లోక్ సభ సమాధానం – http://164.100.24.220/loksabhaquestions/annex/173/AU492.pdf
4. IIS వెబ్ సైట్ – https://ncog.gov.in/IIS/admin/mainDashboardIPRSUrl
Did you watch our new video?