Fake News, Telugu
 

ఆ వీడియోలో ఉన్నది టెర్రరిస్ట్ కాదు. టెరిటోరియల ఆర్మీ 168 బెటాలియన్ కి చెందిన జవాన్.

0

పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదుల మీద చాలా వీడియోలు ఫేస్బుక్ లో వైరల్ అవుతున్నాయి. టెర్రరిస్ట్ దగ్గర నుండి AK-47 రైఫిల్ ని చాలా తెలివిగా ఇండియన్ ఆర్మీ జవాన్ లాక్కుని ప్రజల ప్రాణాలు కాపాడాడని ఒక వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంత నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): టెర్రరిస్ట్ దగ్గరనుండి చాకచక్యంగా AK-47 లాక్కుని ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన జవాన్ కు హేట్సాఫ్.

ఫాక్ట్ (నిజం): టెర్రరిస్ట్ గా వీడియోలో చూపెడుతుంది నిజానికి టెరిటోరియల ఆర్మీ 168 బెటాలియన్ కి చెందిన తారిక్ అహ్మద్. పోస్ట్ చేసిన వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయం తో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఇండియా టుడే మరియు టైమ్స్ అఫ్ ఇండియా  వెబ్ సైట్స్ ఈ ఘటన మీద రాసిన ఆర్టికల్స్ వస్తాయి. అసలు జరిగింది ఏంటంటే 2012 లో తారిక్ పని నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు భార్య కనిపించక పోవడంతో తనకి అక్రమ సంభంధముందని భావించి AK-47 రైఫిల్ ని పట్టుకొని కాల్చడం మొదలు పెట్టాడు. ఆ కాల్పుల్లో ఇద్దరు మహిళలు కూడా మృతి చెందారు. ఆ సమయంలో అకడికి వచ్చిన పోలీసువారు తెలివిగా తారిక్ ని బంధించారు.

చివరగా, వీడియోలో ఉన్నది టెర్రరిస్ట్ కాదు. టెరిటోరియల ఆర్మీ 168 బెటాలియన్ కి చెందిన జవాన్.

Share.

About Author

Comments are closed.

scroll