Fake News, Telugu
 

భారతదేశంలో చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారని సీబీఐ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు.

0

దేశంలో చాలా మంది అమ్మాయిలు తప్పిపోయినట్లు, అమ్మాయిలు మరియు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని లక్నో సీబీఐ చీఫ్ తన నివేదికలో పేర్కొన్నారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: దేశంలో చాలా మంది అమ్మాయిలు తప్పిపోయినట్లు, అమ్మాయిలు మరియు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని లక్నో సీబీఐ చీఫ్ తమ నివేదికలో పేర్కొన్నారు.

ఫాక్ట్(నిజం): భారతదేశంలో చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారని సీబీఐ నివేదిక ఇచ్చినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు .అంతేకాకుండా, అసలు సీబీఐ లక్నో చీఫ్ అనే అధికారి ఉండరు. యూపీలో గత సంవత్సరాలలో  ఆచూకి లభించని బాలికలతో కలుపుకొన్ని 2018లో మొత్తం 3133 బాలికలు అదృశ్యమయ్యారు, ఇందులో నుంచి 2018 చివరి నాటికి 1542 మంది బాలికల ఆచూకిని కనిపెట్టారు. అంటే 2018 చివరి నాటికి అదృశ్యమైన లేదా ఆచూకి లభించని బాలికల సంఖ్యా 1591. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో చెప్పినట్లు సీబీఐ లక్నో చీఫ్ నివేదిక ఇచ్చారా అని ఇంటర్నెట్‌లో వెతికితే, మాకు అలాంటి రిపోర్ట్స్ ఏవీ లభించలేదు. ఒకవేళ అలా ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది. అంతేకాకుండా, అసలు సీబీఐ లక్నో చీఫ్ అనే అధికారి ఉండరు.

అలాగే వైరల్ పోస్టులో చెప్పినట్లు 2015లో 4000 మంది బాలికలు, 2017 నుంచి 2018 వరకు 7000 మంది బాలికలు ఉత్తర్ ప్రదేశ్ (యూపీ)లో అదృశ్యమయ్యారు అనే విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతికగా, 11డిసెంబర్ 2018న లోక్‌సభలో సుప్రియా సులే తప్పిపోయిన పిల్లలు ముఖ్యంగా బాలికల అదృశ్యం గురించి అడిగిన ప్రశ్నకి కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ ఇచ్చిన సమాధానం పరిశీలిస్తే,  యూపీలో 2015లో మొత్తం 2720 మంది 18ఏళ్ల లోపు బాలబాలికలు అదృశ్యమయ్యారు, అందులో 1257 బాలికలు ఉన్నారు. గత సంవత్సరాలలో అదృశ్యమైన బాలికలతో కలుపుకొన్ని యూపీలో మొత్తం 1994 బాలికలు అదృశ్యమయ్యారు. 2015 చివరి నాటికి ఇందులో నుంచి 930 మంది బాలికల ఆచూకిని కనిపెట్టారు, ఇంకా 1064 మంది బాలికల ఆచూకిని కనిపెట్టవలసి ఉంది. అంటే 2015 చివరి నాటికి అదృశ్యమైన బాలికల సంఖ్య 1064.

అలాగే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెలువరించిన వివిధ సంవత్సరాల క్రైమ్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్  పరిశీలించగా, 2017 క్రైమ్ స్టాటిస్టిక్స్ రికార్డ్  ప్రకారం యూపీలో 2017లో మొత్తం 2959 మంది 18ఏళ్ల లోపు బాలబాలికలు అదృశ్యమయ్యారు, అందులో 1526 బాలికలు ఉన్నారు. గత సంవత్సరాలలో అదృశ్యమైన బాలికలతో కలుపుకొన్ని యూపీలో మొత్తం 2571 బాలికలు అదృశ్యమయ్యారు. 2017 చివరి నాటికి ఇందులో నుంచి 1403 మంది బాలికల ఆచూకిని కనిపెట్టారు, ఇంకా 1168 మంది బాలికల ఆచూకిని కనిపెట్టవలసి ఉంది. అంటే 2017 చివరి నాటికి అదృశ్యమైన బాలికల సంఖ్యా 1168.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెలువరించిన 2018 క్రైమ్ స్టాటిస్టిక్స్ రికార్డ్  ప్రకారం యూపీలో 2018లో మొత్తం 3306 మంది 18ఏళ్ల లోపు బాలబాలికలు అదృశ్యమయ్యారు, అందులో 1965 బాలికలు ఉన్నారు. గత సంవత్సరాలలో అదృశ్యమైన బాలికలతో కలుపుకొన్ని యూపీలో మొత్తం 3133 బాలికలు అదృశ్యమయ్యారు. 2018 చివరి నాటికి ఇందులో నుంచి 1542 మంది బాలికల ఆచూకిని కనిపెట్టారు, ఇంకా 1591 మంది బాలికల ఆచూకిని కనిపెట్టవలసి ఉంది. అంటే 2018 చివరి నాటికి అదృశ్యమైన బాలికల సంఖ్యా 1591.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) వెలువరించిన వివిధ సంవత్సరాల క్రైమ్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ ఇక్కడ చూడవచ్చు. అలాగే 2019 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో చాలా మంది బాలికలు,మహిళలు అదృశ్యమయ్యారని వచ్చిన వార్తలను ఇదివరకే FACTLY డీబంక్ చేసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, భారతదేశంలో చాలా మంది బాలికలు అదృశ్యమయ్యారని సీబీఐ ఎలాంటి నివేదిక ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll