Fake News, Telugu
 

‘షియాల్ బేట్’కు సంబంధించిన కేసుని ‘బేట్ ద్వారక’కు ముడిపెడుతూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

గుజరాత్‌లోని హిందూ తీర్థక్షేత్రం ‘బేట్ ద్వారక’లోని రెండు ద్వీపాలను వక్ఫ్ బోర్డు తమవని క్లెయిమ్ చేసిందని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: గుజరాత్‌లోని ‘బేట్ ద్వారక’లోని రెండు ద్వీపాలను వక్ఫ్ బోర్డు తమవని క్లెయిమ్ చేసింది.

ఫ్యాక్ట్ (నిజం): గుజరాత్‌కు దక్షిణంగా ఉన్న ‘షియాల్ బేట్’ అనే ద్వీపానికి సంబంధించిన కేసుని, గుజరాత్‌కు పశ్చిమంగా ఉన్న ‘బేట్ ద్వారక’ కు సంబంధించినదని అని పొరపాటు పడుతున్నారు అని స్థానిక బీజేపీ MP పూనమ్ బెన్ స్పష్టం చేశారు. కోర్టు కాపీలో కూడా ‘బేట్ ద్వారక’ పస్తావన ఎక్కడా లేదు. కావున ఈ పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

పోస్టులో చెప్పిన విషయాన్ని గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే విషయం పైన ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జామ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు, బీజేపీకి చెందిన పూనంబెన్ హేమత్‌బాయ్ ఇదే విషయం పై మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు, “బేట్ ద్వారక తమకు చెందుతుంది అని వక్ఫ్ బోర్డు ఎక్కడా కూడా క్లెయిమ్ చేయలేదు. ఈ విషయాన్ని న్యాయమంత్రిత్వ శాఖ మరియు జిల్లా కలెక్టర్ ద్వారా నిర్ధారించుకున్నాను”

ఆలాగే గుజరాత్ వక్ఫ్ బోర్డువారు కూడా ఈ ప్రచారాన్ని ఖండిస్తూ, తాము హైకోర్టులో ఎటువంటి స్థలానికి సంబంధించి పిటిషన్ వేయలేదు అని స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ ముస్లిం సంస్థ షియాల్ బేట్ లో ఉన్న సవాయ్ పీర్ దర్గాకు సంబంధించి వేసిన కేసులో హై కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే వెళ్ళాము అని చెప్పారు. బేట్ ద్వారక, షియాల్ బేట్ పేర్లు ఒక విధంగా ఉండటం వలన ఈ గందరగోళం తేలెత్తిందని, ఈ కేసుతో అసలు బేట్ ద్వారకాకు సంబంధం లేదని పూనంబెన్ వివరించారు. గుజరాత్ టూరిజం వెబ్సైటు ప్రకారం, ‘‘బేట్ ద్వారక’ అనే ద్వీపం గుజరాత్ కు పశ్చిమంగా ఉంటుంది. శ్రీ కృష్ణుడు ఇక్కడ నివసించినట్లు అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ వివిధ దేవుళ్లకు సంబంధించిన మందిరాలు కూడా ఉన్నాయి. ఇక షియాల్ బేట్ అనేది గుజరాత్ కు దక్షిణంగా ఉన్న అమ్రేలి జిల్లాకు చెందిన ఒక ద్వీపము. ఇక్కడ ఉన్న వివిధ పురాతన కట్టడాలను చూడడానికి సందర్శకులు వస్తుంటారు.’

షియాల్ బేట్ కు సంభందించిన కేసు వివరాలను ఇక్కడ చూడవచ్చు. ఈ పిటిషన్లో ఎక్కడా కూడా బేట్ ద్వారక ప్రస్తావన లేదు.

Times of India’ కథనం ప్రకారం, సవాయి పీర్ మరియు ఇతార్ పీర్ దర్గా మసీద్ ట్రస్ట్ వారు అక్కడ ఉన్న దర్గాలకు, ప్రభుత్వ అధికారులు జాతీయ భద్రత నెపంతో పర్యటకులని  అనుమతించటం లేదని కోర్టును ఆశ్రయించారు. మరియు వక్ఫ్ బోర్డుకు చెందిన ఈ స్థలంలో గుడిని కడుతున్నారు అని ఈ పిటిషన్లో పేర్కొన్నారు.

కావున, బెట్ ద్వారక తమకు చెందినది అని వక్ఫ్ బోర్డు ఎక్కడా క్లెయిమ్ చేయలేదు. ‘షియాల్ బేట్’కు సంభందించిన కేసుని ‘బేట్ ద్వారక’కు ముడిపెడుతూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll