అక్టోబర్ 21 న హుజూర్ నగర్ లో జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి 80 శాతం ఓటర్లు మద్దత్తు తెలుపుతున్నట్టు ‘C Voter’ సర్వేలో తేలిందని ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్ల స్పందన తెలిపిన ‘C Voter’ సర్వే.
ఫాక్ట్ (నిజం): హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై తాము ఎటువంటి సర్వే ఫలితాలను వెలువడించలేదని ‘C Voter’ సంస్థ వారు FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని సర్వే ఫలితాల కొరకు గూగుల్ లో ‘huzurnagar by-poll c voter survey’ అని వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో ఎటువంటి సమాచారం దొరకదు. ఒకవేల వారు అలాంటి సర్వే ఏమైనా నిర్వహిస్తే వార్తాసంస్థలు ఆ సర్వే ఫలితాలను ప్రచురించేవి. కావున, పోస్ట్ లోని సర్వే పై వివరణ కొరకు ‘C Voter’ సంస్థ వారికి FACTLY ఫోన్ చేసి మాట్లాడగా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై తాము ఎటువంటి సర్వే ఫలితాలను వెలువడించలేదని వారు తెలిపారు.
చివరగా, హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై ‘C Voter’ వారు ఎటువంటి సర్వే ఫలితాలను వెలువడించలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: హుజూర్ నగర్ ఉప ఎన్నిక పై ‘C- Voter’ వారు ఎటువంటి సర్వే ఫలితాలను వెల్లడించలేదు - Fact Checking Tools | Factbase.us