“భారతదేశంలో పేదవారిలో అధిక భాగం ముసల్మానులున్నారు. ఎందుచేత? వారిని కత్తితో బెదిరించి మతం మార్పించారన్నది అర్థం లేని మాట. జమిందారుల నుండి, బ్రాహ్మణుల నుండి విముక్తి పొందడానికే మారారు”, అని స్వామి వివేకానంద అన్నట్టు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “భారతదేశంలో పేదవారిలో అధిక భాగం ముసల్మానులున్నారు. ఎందుచేత? వారిని కత్తితో బెదిరించి మతం మార్పించారన్నది అర్థం లేని మాట. జమిందారుల నుండి, బ్రాహ్మణుల నుండి విముక్తి పొందడానికే మారారు.” – స్వామి వివేకానంద
ఫాక్ట్: భారతదేశంలో పేదలు ఇస్లాంను మనస్పూర్తిగా స్వీకరించారని, కత్తితో బెదిరిస్తే మతం మారలేదని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. హిందూ మతం నుండి ఇస్లాం మరియు క్రైస్తవానికి మారిన ఎక్కువ శాతం మంది కత్తితో బెదిరించినప్పుడు మతం మారవలసివచ్చిందని స్వామి వివేకానంద అన్నారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
స్వామి వివేకానంద ఇస్లాం గురించి అలా అన్నట్టు ఆన్‌లైన్‌లో ఎక్కడా కూడా ఎటువంటి కచ్చితమైన సమాచారం లేదు. ‘Complete Works of Swami Vivekananda’ పుస్తకంలో కూడా భారతదేశంలో పేదలు ఇస్లాంను మనస్పూర్తిగా స్వీకరించారని కత్తితో బెదిరిస్తే మతం మారలేదని స్వామి వివేకానంద అన్నట్టు ఎక్కడా కూడా లేదు.
ఏప్రిల్ 1899లో, హిందూ మతంలో జరుగుతున్న మతమార్పిడి గురించి స్వామి వివేకానందున్ని ప్రభుద్ద భారత్ ఎడిటర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. హిందూ మతం నుండి ఇస్లాం మరియు క్రైస్తవానికి మారిన ఎక్కువ శాతం మంది కత్తితో బెదిరించినప్పుడు మతం మారవలసివచ్చిందని అన్నారు.
చివరగా, భారతదేశంలో పేదలు ఇస్లాంను మనస్పూర్తిగా స్వీకరించారని, కత్తితో బెదిరిస్తే మతం మారలేదని, స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు.