‘బృందావనం లోని ప్రముఖ ఇమెళితల్ దేవాలయంలో వృద్ద వైష్ణవ పూజారి శ్రీ తమల్ కృష్ణ దాస్ మీద బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యా శాంతికాముకుల దాడి’’ అని చెప్తూ సోషల్ మీడియా లో కొన్ని ఫోటోలతో కూడిన పోస్టుని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తమల్ కృష్ణ దాస్ అనే సాధువు మీద బృందావనం (యూపీ) లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యా ముస్లింలు దాడి చేసారు.
ఫాక్ట్ (నిజం): తమల్ కృష్ణ దాస్ (ఇమ్లితాలాలోని ఒక మఠం మాజీ అధ్యక్షుడు) మీద దాడి జరిగిందనే విషయం నిజమే, కానీ దాడి చేసిన వారు ముస్లింలు లేదా బంగ్లాదేశీయులు కాదు. నిందితులు బీ.పీ.సాధు (మఠం ప్రస్తుత అధ్యక్షుడు) యొక్క అనుచరులు. కావున, పోస్టు లో చెప్పింది తప్పు.
పోస్టు లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు, ఆ సంఘటనకు సంబంధించి ‘మధుర పోలీసులు’ అంతకుముందే తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఒక ట్వీట్‌కు సమాధానంగా పెట్టిన వీడియో లో పోలీసు అధికారి మాట్లాడుతూ, అది అంతర్గత వైరం వల్ల జరిగిన ఘటన అని పేర్కొన్నారు. ఇమ్లితాలాలోని ఒక మఠం ప్రస్తుత అధ్యక్షుడు అయిన బీ.పీ.సాధు యొక్క అనుచరులు తమల్ కృష్ణ దాస్ (మఠం మాజీ అధ్యక్షుడు) పై దాడి చేసారని తెలిపాడు. ప్రధాన నిందితుడు సచిదానంద్ ను అరెస్ట్ చేసారని, ఇతర నిందితులు (గోవింద్, జగన్నాథ్ మరియు సెక్యూరిటీ గార్డ్- గోవింద్ సింగ్) పరారీలో ఉన్నరని వీడియో ద్వారా తెలుస్తుంది.
నిందితులు బంగ్లాదేశీయులు అనే తప్పుడు ఆరోపణతో ఫోటోలు వైరల్ అవ్వడంతో, మధుర పోలీసులు ఆ పోస్ట్‌లో చేసిన ఆరోపణను ఖండిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు, పుస్తకాలతో ఉన్న ఒక గదిని తెరవడంపై గొడవ జరిగిందని పోలీసులు ఆ ట్వీట్ లో స్పష్టం చేశారు.
చివరగా, బృందావనం ఆశ్రమంలోని సాధువు పై దాడి చేసింది ముస్లింలు లేదా బంగ్లాదేశీయులు కాదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?