Fake News, Telugu
 

వీడియోలోని కుస్తీ పోటీలో తలపడ్డ ఇద్దరు మహిళలు భారతీయులే

0

ఇద్దరు మహిళలు కుస్తీ పడుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, ‘ముంబైలో జరిగిన కుస్తీ పోటీలలో విజయం సాధించిన ఒక పాకిస్తానీ మల్లయోధురాలు విజయ గర్వముతో భారతీయ మహిళలకు ఛాలెంజ్ విసిరింది. దమ్మున్న ఏ భారతీయ మహిళైనా తనను ఓడించమని అంది. దాంతో, ప్రేక్షకులలో ఉన్న ‘సంధ్య పాడకే’ అనే ఒక దుర్గా వాహిని కార్యకర్త ఆ సవాలును స్వీకరించింది. ఆ పైన ఏం జరిగిందో చూడండి’ అని చెప్తున్నారు.  అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత్ మరియు పాకిస్తాన్ మహిళలు కుస్తీలో తలపడ్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని కుస్తీ పోటీలో తలపడ్డ ఇద్దరు మహిళలు భారతీయులే. అందులో ఒకరు భారత మొట్టమొదటి మహిళా రెజ్లర్ ‘బీబీ బుల్ బుల్’ (నల్లని దుస్తుల్లో), ఇంకొకరు హర్యానా మాజీ పోలీసు అధికారిణి ‘కవిత’ (సల్వార్ కమీజ్ లో). కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం ఆధారంగా, గూగుల్ లో ‘Women wrestling india and pakistan’ అని వెతికినప్పుడు, అలాంటి విషయంతో పెట్టిన ట్వీట్ సెర్చ్ రిజల్ట్స్ లో లభించింది. దాని కామెంట్స్ లో,  ఒక వ్యక్తి ఆ వీడియోలో తలపడిన ఇద్దరు మహిళలు భారతీయులే అని చెప్తూ, అందులో ఒకరు ‘బీబీ బుల్’, మరొకరు హర్యానా మాజీ పోలీసు అధికారిణి మరియు పవర్ లిఫ్టర్ ‘కవిత’ అని ఒక యూట్యూబ్ వీడియో ని పొందుపరిచాడు. 

ఆ సమాచారంతో వెతికినప్పుడు, ‘The News Minute’ వారి కథనం లభించింది. దాని ద్వారా, వీడియోలోని కుస్తీ పోటీలో తలపడ్డ ఇద్దరు మహిళల్లో ఒకరు భారత మొట్టమొదటి మహిళా రెజ్లర్ ‘బీబీ బుల్ బుల్’ (నల్లని దుస్తుల్లో) అనీ, ఇంకొకరు హర్యానా మాజీ పోలీసు అధికారిణి మరియు పవర్ లిఫ్టర్ అయిన ‘కవిత’ (సల్వార్ కమీజ్ లో) అని తెలిసింది. ఆ సంఘటన జలంధర్ లో జరిగిన ‘కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (CWE)’ ఈవెంట్ లో జరిగిందని తెలిసింది.

చివరిగా, వీడియోలోని కుస్తీ పోటీలో తలపడ్డ ఇద్దరు మహిళలు భారతీయులే.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll