ముస్లింలు ప్లేట్లను మరియు స్పూన్లను నాకుతున్నట్లుగా ఉన్న వీడియో ని కొంత మంది ఫేస్బుక్ లో పోస్టు చేసి, వారు కొరోనావైరస్ ని వ్యాప్తి చేయడానికి అలా చేస్తున్నారంటూ పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: వీడియోలో ముస్లింలు కొరోనావైరస్ ని వ్యాప్తి చేయడానికి ప్లేట్లను మరియు స్పూన్లను నాకుతున్నారు.
ఫాక్ట్ (నిజం): వీడియో ఇంటర్నెట్లో కనీసం జులై 2018 నుండి ఉంది. అంటే, వీడియో ప్రపంచం లో మొట్టమొదటి కొరోనావైరస్ కేసు నమోదవడానికంటే కూడా ముందుది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
మొట్టమొదటి కొరోనావైరస్ కేసు చైనా లో డిసెంబర్ 2019 లో నమోదయింది.
వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటికి ‘టైం ఫిల్టర్’ పెట్టి వెతికినప్పుడు, ఆ వీడియో ఇంటర్నెట్ లో కనీసం జులై 2018 నుండి ఉన్నట్లుగా తెలిసింది. ఆ వీడియో ని మొట్టమొదటిసారిగా ఒక ట్వీట్ లో పెట్టినట్లుగా తెలిసింది. దాని ద్వారా, అందులో ఉన్న ముస్లింలు ‘బోహ్రా’ సముదాయానికి చెందిన వారని తెలుస్తుంది. ఆ సమాచారం తో కీవర్డ్స్ తో గూగుల్ లో వెతికినప్పుడు, అదే వీడియో‘Vimeo’ లో లభించింది. దాని వివరణ లో, ఆ వీడియో లోని బోహ్రా ముస్లింలు ప్లేట్లను మరియు స్పూన్లను నాకుతున్నది ఆహారాన్ని వృధా చేయోద్దనే ఉద్దేశంతో అని ఉంది.
బొహ్ర ముస్లింలకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతికినప్పుడు, ‘National’ పత్రిక ఆ కమ్యూనిటీ వారి విభిన్న ఆహార పద్ధతుల గురించి ప్రచురించిన కథనం లభించింది. అందులో, బొహ్ర ముస్లింలు తమ కుటుంబం తో కలిసి ఒకే ప్లేట్ (తాల్) లో తింటారనీ, వారు ఆహరం విషయంలో ‘నో వేస్టేజ్’ పాలసీ ని పాటిస్తారనీ, అందువల్ల తమ ప్లేట్ లో ఒక బియ్యపు గింజని కూడా మిగల్చరని ఉంది. అంతేకాదు, ఆ కథనం లో బోహ్రా ముస్లింలను చాలా తేలికగా గుర్తు పట్టవచ్చని, వారు తమ నెత్తి పై ‘బంగారు రంగు’ ఎంబ్రాయిడరీ తో ఉన్న తెల్లని టోపీ లు పెట్టుకుంటారని ఉంది.
వీడియో లోని వ్యక్తులు ధరించిన టోపీ లను బొహ్ర ముస్లింలు ధరించే టోపీలతో పోలిస్తే ఒకేలా ఉన్నట్లు చూడవచ్చు. కావున, వీడియో లో ఉన్నది బోహ్రా ముస్లింలు మరియు వారు ఆహారాన్ని ఏ మాత్రం కూడా మిగల్చకూడదు అనే ఉద్దేశంతో ప్లేట్లను మరియు స్పూన్లను నాకుతున్నారు.
చివరిగా, పాత వీడియోని పెట్టి, ‘ముస్లింలు కొరోనావైరస్ ని వ్యాప్తి చేయడానికి ప్లేట్లను మరియు స్పూన్లను నాకుతున్నారు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
We can’t mix up d religion into the other aspects in this critical juncture :-<<<<