Fake News, Telugu
 

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కి 25 శాతం ఓట్లు రాలేదు, సుమారు 15 శాతం వచ్చాయి

0

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో బీజేపీ పార్టీ యొక్క ఓట్ల శాతం పెరుగుతూ వచ్చిందని చెప్తూ, కొన్ని అంకెలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కి 25 శాతం ఓట్లు వచ్చాయి. 

ఫాక్ట్ (నిజం): తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల యొక్క డేటాని FACTLY వారు విశ్లేషించి చూడగా, బీజేపీ కి సుమారు 15 శాతం వచ్చినట్టు తెలిసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

తాజాగా వెలువడిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ‘తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్’ వారి వెబ్ సైట్ నుండి తీసుకొని, ఆ డేటాని FACTLY వారు విశ్లేషించి చూడగా, బీజేపీ కి సుమారు 15 శాతం వచ్చినట్టు తెలిసింది. ఇదే విషయం ‘ఈనాడు’ వార్తాసంస్థ వారు ప్రచురించిన ఆర్టికల్ లో కూడా చూడవొచ్చు.

తెలంగాణ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి వచ్చిన ఓట్ల శాతం కూడా పోస్టులో ఉన్నాయి. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజీపీ కి సుమారు 6.98 శాతం ఓట్లు వచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు; పోస్టులో 8 శాతం అని ఉంది. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ కి 19.65 శాతం ఓట్లు వచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు; పోస్టులో 21 శాతం అని ఉంది.

చివరగా, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కి 25 శాతం ఓట్లు రాలేదు, సుమారు 15 శాతం వచ్చాయి.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll