Fake News, Telugu
 

పశ్చిమ బెంగాల్ లో హింస సందర్భంలో NRC అవసరమని ఈ ట్వీట్ చేసింది అజిత్ దోవల్ ఫ్యాన్ పేజి (పేరడీ) అకౌంట్

0

భారతదేశంలో NRC చట్టం ఎందుకు తేవాలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న అల్లర్లు చూస్తే అర్ధమవుతుంది అని నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ (NSA) అజిత్ దోవల్ ట్వీట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆ రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకున్న అల్లర్ల సందర్భంలో NRC అవసరమని NSA అజిత్ దోవల్ పెట్టిన ట్వీట్.

ఫాక్ట్ (నిజం): NSA అజిత్ దోవల్ కి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదు. అజిత్ దోవల్ పేరుతో ఉన్న ఒక ఫ్యాన్ పేజి (పేరడీ) ట్విట్టర్ అకౌంట్, ఈ ట్వీట్ చేసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల తరువాత చోటుచేసుకున్న అల్లర్ల గురించి అజిత్ దోవల్ మీడియాతో గాని, మరే ఇతర మాధ్యమాలలో స్పందించలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ట్వీట్ కోసం ట్విట్టర్ లో వెతకగా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ (NSA) అజిత్ దోవల్ కి ట్విట్టర్ లో అధికారిక అకౌంట్ లేదని తెలిసింది. అజిత్ దోవల్ కి ట్విట్టర్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా సైట్స్ లో కూడా అధికారిక అకౌంట్లు లేవని తెలిసింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫలితాల తరువాత చోటుచేసుకున్న అల్లర్ల గురించి NSA అజిత్ దోవల్ మీడియాతో గాని, లేక ఇతర మాధ్యమాలలో గాని ఎక్కడా స్పందించలేదు.

పోస్టులో షేర్ చేసిన ట్వీట్ పై కనిపిస్తున్న యూసర్ పేరు (@ajit_dovalfan) ఆధారంగా ఆ ట్వీట్ పెట్టిన ట్విట్టర్ హేండిల్ దొరికింది. జూలై 2020లో సృష్టించబడిన ఈ ట్విట్టర్ అకౌంట్, NSA అజిత్ దోవల్ ఫ్యాన్ పేజి (పేరడీ) క్లబ్ కి సంబంధించిందని ప్రొఫైల్ వివరణలో స్పష్టం చేసారు. పోస్టులో షేర్ చేసిన ట్వీట్ ని, ఈ ఫ్యాన్ పేజి అకౌంట్ 04 మే 2021 నాడు పోస్ట్ చేసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ట్వీట్ అజిత్ దోవల్ ఫ్యాన్ పేజి పోస్ట్ చేసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఫ్యాన్ పేజి (పేరడీ) అకౌంట్ పెట్టిన ట్వీట్ ని షేర్ చేస్తూ పశ్చిమ బెంగాల్ రాష్టంలో చోటుచేసుకున్న అల్లర్ల గురించి NSA అజిత్ దోవల్ స్పందిస్తూ పెట్టిన ట్వీట్ అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll