Fake News, Telugu
 

ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుచుకున్న స్థానాలు 56కి గుణిజాలు కావు

0

నరేంద్ర మోదీ మద్దతుదారులు తరచూ 56 ఇంచ్ ఛాతీ అనే పదము ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 56కి గుణిజాల సంఖ్య స్థానాల్లో విజయం సాధించిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. 2023లో ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో 56 సీట్లు, రాజస్థాన్‌లో 112 సీట్లు (56×2), మధ్యప్రదేశ్‌లో 168 సీట్లు (56×3) బీజేపీ గెలుచుకుంది అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 56కి గుణిజాల సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంది.

ఫాక్ట్ (నిజం): ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా  సమాచారం  ప్రకారం, ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు సాధించి మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీకి 56కి గుణిజాల సంఖ్యలో సీట్లు దక్కలేదు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో క్లెయిమ్ చేసిన వివరాల కోసం ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా వెబ్ సైట్ లో వెతకగా, ఇటివల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల  ఫలితాల వివరాలు మాకు లభించాయి. ఈ సమాచారం  ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో బీజేపి 54 స్థానాలలో విజయం సాధించింది.

అలాగే రాజస్థాన్ లో రాజస్థాన్‌లో 115 స్థానాల్లో విజయం సాధిచింది. ఇక మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు బీజేపీ గెల్చుకున్నది. మూడు రాష్ట్రాలలో బీజేపీ మెజారిటీ స్థానాలను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కాని పోస్టులో చెప్తున్నట్టు ఈ మూడు రాష్ట్రాలలో బీజేపీ 56కి గుణిజాల సంఖ్యలో స్థానాలు మాత్రం గెలుచుకోలేదు. నియోజికవర్గాల వారిగా ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇక్కడ- ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ చూడవొచ్చు.

చివరగా, ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గెలుచుకున్న స్థానాలు 56కి గుణిజాల సంఖ్యలో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll