Fake News, Telugu
 

ముస్లిముల పండగ బక్రీద్‌ను ఏమైనా అంటే ఒప్పుకోను అని బిల్ గేట్స్ అనలేదు

0

‘ముస్లిముల పండగ బక్రీద్ ను ఏమైనా అంటే ఒప్పుకోను,’ అని బిల్ గేట్స్ అన్నారని ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా బాగా షేర్ చేస్తున్నారు. ‘జంతువుల్ని వధిస్తున్నారని ముస్లిములను అసహ్యించుకునే ట్వీట్లను నేను ఆమోదించను. కే.ఎఫ్.సి, మెక్డోనాల్డ్, బర్గర్ కింగ్ వంటి సంస్థలు ప్రతీ రొజూ ఒక మిలియన్ జంతువుల్ని, కేవలం ధనవంతుల కోసం వధించి డబ్బు కూడబెట్టుకుంటున్నాయి. ఈద్ సందర్భంగా ముస్లిముల జిబహ్ చేసే జంతువుల మాంసం పేదలకు ఉచితంగా పంచబడుతుంది అనే వాస్తవం మీరు తెలుసుకోవాలి’, అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించినట్టు పోస్టులో అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: ముస్లిముల పండగ బక్రీద్‌ను ఏమైనా అంటే ఒప్పుకోను అని బిల్ గేట్స్ అన్నారు.

ఫాక్ట్: ముస్లిముల పండగ బక్రీద్‌ను ఏమైనా అంటే ఒప్పుకోను అని బిల్ గేట్స్ అన్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. బిల్ గేట్స్ యొక్క అధికారిక ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్‌లో కూడా ముస్లిముల పండగ బక్రీద్ గురించి వ్యాఖ్యానించినట్టు ఎక్కడా లేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, బిల్ గేట్స్ అలా అన్నారని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే బిల్ గేట్స్ అలా అని ఉంటే, ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి. బిల్ గేట్స్ యొక్క అధికారిక ట్విట్టర్, ఫేస్బుక్, బ్లాగ్‌లో కూడా ముస్లిముల పండగ బక్రీద్ గురించి వ్యాఖ్యానించినట్టు ఎక్కడా లేదు. పోస్టులో ఉన్న వ్యాఖ్యల్ని ఇంగ్లీష్‌లో అనువదించి సెర్చ్ చేసినప్పుడు, ఇటువంటి వ్యాఖ్యలతో కూడిన ట్విట్టర్ పోస్ట్ ఒకటి 10 ఆగస్ట్ 2019లోనే ఒకరు పబ్లిష్ చేసారని తెలుస్తుంది, కానీ, ఈ పోస్టులో బిల్ గేట్స్ అన్నట్టుగా లేదు.

2019లో కూడా ఇలానే ఒక పోస్టులో బిల్ గేట్స్ ఇలా అన్నారు అని వైరల్ అయినప్పుడు, FACTLY రాసినఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ముస్లిముల పండగ బక్రీద్‌ను ఏమైనా అంటే ఒప్పుకోను అని బిల్ గేట్స్ ఎటువంటి వ్యాఖ్యలు అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll