Fake News, Telugu
 

భగత్ సింగ్ ను ఉరి తీసింది 23 మార్చ్ 1931 న ; ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు

0

భారత దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న  భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను 1931వ సంవత్సరం, ఫిబ్రవరి 14న (‘వాలెంటైన్స్ డే’) లాహోర్లో ఉరిఖంబం ఎక్కించారని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ ఫేస్ బుక్ లో  ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ చేసే క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను 1931లో ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఉరి తీశారు.   

ఫాక్ట్ (నిజం): భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను ఉరి తీసింది 23 మార్చ్ 1931న , పోస్టులో చెప్పినట్టు ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు. కావున, పోస్ట్ లో చేసిన క్లెయిమ్ తప్పు.    

దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లు చేసిన త్యాగానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం, మార్చ్ 23న ‘షహీద్ దివాస్/అమర వీరుల దినోత్సవం’ జరుపుతారు. ‘DD News’ లో అమర వీరుల దినోత్సవం రోజు ప్రసారం చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

25 మార్చ్ 1931న, ‘The Tribune’ అనే దిన పత్రికలో వారిని ఉరి తీసినట్టు వచ్చిన వార్తని ‘prasarbharati’ ట్వీట్ చేసింది.  ‘The Hindu’ దిన పత్రికలో కూడా మార్చ్ 24, 1931న ఆ విషయం పై ప్రచురించిన ఆర్టికల్ ని చూడవచ్చు.

1931 మార్చ్ నెలలో భారత దేశం లోని అంతర్గత రాజకీయ పరిస్థితుల పైన ప్రతీ రెండు వారాలకు రాసిన రిపోర్ట్ లను ‘National Archives of India’ పోర్టల్ నుండి ‘Factly’ టీమ్ తీసుకుంది. ఆ రిపోర్ట్స్ ని ప్రతీ నెల బ్రిటిష్ ప్రభుత్వానికి పంపేవారు. వాటి ద్వారా భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లు 23 మార్చ్ 1931న ఉరి తీయబడ్డారని స్పష్టం అవుతుంది.

చివరగా,  భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లు ఉరితీయబడింది 23 మార్చ్ 1931న అయితే కొంతమంది మాత్రం వాళ్ళు ‘వాలెంటైన్స్ డే’ రోజున ఉరి తీయబడ్డారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll