టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్ లో కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ కి తాము మద్దతు ఇస్తామని తెలిపిన తరుణంలో, తాజాగా బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ఎర్డోగాన్ ని ఆయన అధ్యక్ష భవనంలో కలిసాడని చెప్తున్న వీడియో తో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చలామణీ అవుతోంది. వారి భేటీ కి సంబంధించిన ఫోటో అంటూ కూడా ఫేస్బుక్ లో ఒక ఇమేజ్ షేర్ అవుతోంది. వాటిలో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.


క్లెయిమ్: బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ని తాజాగా ఆయన అధ్యక్ష భవనంలో కలిసాడు.
ఫాక్ట్ (నిజం): ఆమీర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ని తాజాగా కలవలేదు. పోస్టులోని ఇమేజ్ 2017 లో ఆమీర్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రచారంలో భాగంగా టర్కీ వెళ్ళినప్పుడు ఎర్డోగాన్ ని ఆయన అధ్యక్ష భవనంలో కలిసినప్పటిది. కావున, ఆమీర్ ఖాన్ తాజాగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ని కలిసాడంటూ వస్తున్న వార్త తప్పు.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్ లో కాశ్మీర్ అంశంలో పాక్ కి తాము మద్దతు ఇస్తామని తెలిపినట్లుగా ‘The Hindu’ వారి ‘15 ఫిబ్రవరి 2020’ కథనం ద్వారా తెలిసింది. కానీ, ఆమీర్ ఖాన్ తాజాగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ని కలిసినట్లుగా న్యూస్ రిపోర్ట్స్ ఏమీ లభించలేదు. పోస్టులో ఉన్న ఇమేజ్ ఎర్డోగాన్ ని ఆమీర్ ఖాన్ టర్కీ అధ్యక్ష భవనం లో 2017లో కలిసినప్పటిదని ‘Turkish Presidency’ వారి ట్వీట్ ద్వారా తెలుస్తుంది. ఆమీర్ ఖాన్ 2017లో తన రాబోయే చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రచారంలో భాగంగా టర్కీ వెళ్ళినప్పుడు అధ్యక్షుడు ‘ఎర్డోగాన్’ ని కలిసినట్లుగా ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది.
చివరగా, టర్కీ అధ్యక్షుడు ‘ఎర్డోగాన్’ ని ఆమీర్ ఖాన్ తాజాగా కలవలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?