ముంబైలోని ప్రముఖ బాంద్రా-వర్లి సీ లింక్‌ని ప్రధానమంత్రి మోదీ హయాంలో నిర్మించినట్టు అర్ధం వచ్చేలా చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ముంబైలోని ప్రముఖ బాంద్రా-వర్లి సీ లింక్‌ని ప్రధానమంత్రి మోదీ హయాంలో నిర్మించారు.
ఫాక్ట్ (నిజం): బాంద్రా-వర్లి సీ లింక్ నిర్మాణ పనులు 2004లో మొదలు కాగా, 2009లో కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిని ప్రాంభించారు. ఈ బాంద్రా-వర్లి సీ లింక్ మోదీ ప్రధాని కాక ముందే పూర్తయ్యింది, దీని నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
బాంద్రా-వర్లి సీ లింక్ నిర్మాణానికి సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా 2009లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సీ లింక్‌ని ప్రారంభించిన విషయానికి సంబంధించి అనేక వార్తా కథనాలు దొరికాయి. ఈ కథనాల ప్రకారం ఈ సీ లింక్‌ని నిర్మించాలని 1990లలోనే అనుకున్నా నిర్మాణ పనులు మాత్రం 2004లో మొదలయ్యాయి. ఈ వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.
సోనియా గాంధీ 2009లో ఈ సీ లింక్‌ని ప్రారంభించినప్పటి ఫోటోలు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో రిపోర్టులని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ సీ లింక్ మోదీ మొదటిసారి ప్రధానమంత్రి కాక ముందే జరిగింది. దీన్నిబట్టి ఈ సీ లింక్‌కి ప్రధానమంత్రి మోదీకి ఎటువంటి సంబంధంలేదని స్పష్టంగా అర్ధమవుతుంది.
చివరగా, బాంద్రా-వర్లి సీ లింక్ 2009లోనే కాంగ్రెస్ హయాంలో పూర్తయింది. దీని నిర్మాణానికి, ప్రధానమంత్రి మోదీకి ఎటువంటి సంబంధం లేదు.