Fact Check, Fake News, Telugu
 

02 నవంబర్ 2020న 2018 VP1 గ్రహశకలం భూమి వైపు వచ్చినా ప్రళయం రాదని చెప్పిన నాసా

0

02 నవంబర్ 2020న 2018 VP1 అనే ఒక గ్రహశకలం (ఆస్ట్రాయిడ్‌) భూమిని ఢీకొట్టేందుకు 0.41% శాతం అవకాశం ఉందని, ఒక వేల అది భూమిని ఢీ కొడితే ప్రళయమే అని నాసా శాస్త్రవేత్తలు చెప్పినట్టు ‘టీవీ 9’ వారు ఒక యూట్యూబ్ వీడియోని (ఆర్కైవ్డ్) వారి ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసారు. అదే విషయాన్నీ చెప్తూ, వారి వెబ్సైటులో కూడా ఒక ఆర్టికల్ (ఆర్కైవ్డ్) ని ప్రచురించారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): 02 నవంబర్ 2020న 2018 VP1 గ్రహశకలం భూమిని ఢీ కొడితే ప్రళయమే అని అంటున్న నాసా శాస్త్రవేత్తలు.

ఫాక్ట్ (నిజం):  2018 VP1 గ్రహశకలం చాలా చిన్నదని (సుమారు రెండు మీటర్లు), దాని వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని నాసా తెలిపింది. ఆ గ్రహశకలం భూమి వాతావరణంలోకి రావడానికి కేవలం 0.41 శాతం అవకాశం ఉంది. ఒక వేల భూమి వాతావరణంలోకి ప్రవేశించినా, అది చాలా చిన్నగా ఉండడం వల్ల వాతావరణంలోనే విచ్ఛిన్నమవుతుంది అని నాసా తెలిపింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఈ విషయం పై నాసా సంస్థ ఇంతకముందే వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ‘NASA Asteroid Watch’ ద్వారా ఈ విషయం పై ట్వీట్ చేసారు. 2018 VP1 గ్రహశకలం చాలా చిన్నదని (సుమారు రెండు మీటర్లు), దాని వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. ఆ గ్రహశకలం భూమి వాతావరణంలోకి రావడానికి కేవలం 0.41 శాతం అవకాశం ఉందని, ఒక వేల భూమి వాతావరణంలోకి ప్రవేశించినా, అది చాలా చిన్నగా ఉండడం వల్ల వాతావరణంలోనే విచ్ఛిన్నమవుతుందని ట్వీట్ చేసారు.

ఆ గ్రహశకలం గురించిన మరింత సమాచారం ఇక్కడ చదవొచ్చు.

గ్రహశకలాల గురించి నాసా వెబ్సైటులో చూడగా, 25 మీటర్ల కంటే చిన్న గ్రహశకలాలు భూమి వైపు వచ్చినా అవి వాతావరణంలోనే విచ్ఛిన్నమవుతాయని రాసి ఉన్నట్టు చదవొచ్చు. 2018 VP1 గ్రహశకలం సైజు కేవలం రెండు మీటర్లు మాత్రమే.

వచ్చే 100 ఏళ్ళలో ప్రళయం సంభవించే అంతగా భూమిని ఢీ కొట్టే గ్రహశకలం ఇప్పటివరకు అయితే కనుగోనబడలేదని నాసా వెబ్సైటులో రాసి ఉంది. భూమి వైపు వచ్చే అవకాశం ఉండే గ్రహశకలాల లిస్టుని ‘Sentry Impact Risk Page’ లో నాసా పెడుతుంది. 2018 VP1 గ్రహశకలం ని కూడా ఆ లిస్టులో చూడవొచ్చు. ఒక గ్రహశకలం వల్ల భూమిపై ఎంత ప్రభావం పడుతుందని చూపెట్టడానికి ‘టొరినో ఇంపాక్ట్ హజార్డ్ స్కేల్’ ని నాసా వాడుతుంది. ఆ స్కేల్ లో 2018 VP1 గ్రహశకలం కి జీరో ఇచ్చినట్టు చూడవొచ్చు. అంటే, దాని ప్రభావం భూమి పై దాదాపు అసలు లేనట్టే.

పది రోజుల కిందట కూడా 3 నుండి 6 మీటర్ల సైజు ఉన్న 2020 QG గ్రహశకలం భూమి దగ్గర నుండి పోయిందని నాసా వెబ్సైటులో చదవొచ్చు.

చివరగా, 02 నవంబర్ 2020 న 2018 VP1 గ్రహశకలం భూమి వైపు వచ్చినా ప్రళయం రాదని చెప్పిన నాసా.

Share.

About Author

Comments are closed.

scroll