Fake News, Telugu
 

ఢిల్లీ పోలీసుల పాత వీడియోని ‘వివేక్ దూబే ఎన్కౌంటర్ తర్వాత సంబరాలు చేసుకుంటున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు’ అని షేర్ చేస్తున్నారు

0

పోలీసులు డాన్స్ చేస్తున్న ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, వివేక్ దూబే ఎన్కౌంటర్ అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అని ఆ వీడియో గురించి చెప్తున్నారు. వివేక్ దూబే కాన్పూర్ కి చెందిన ఒక నేరస్తుడు. అతను ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల ఎన్కౌంటర్ లో ‘10 జులై 2020’ న చనిపోయాడు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వివేక్ దూబే ఎన్కౌంటర్ అనంతరం సంబరాలు చేసుకుంటున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో ఇటీవల జరిగిన ఘటనకి సంబంధించినది కాదు, అది కనీసం ‘ఫిబ్రవరి 2019’ నుండి ఇంటర్నెట్ లో ఉంది. అంతేకాదు, వీడియో లో డాన్స్ చేస్తోంది ఢిల్లీ పోలీసులు, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్లని మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఆ వీడియో కి టైటిల్ ‘Police dance // Me Nikla Gaddi lekar // SHO Dance // Police Program’ మరియు టైంస్టాంప్ ‘4 ఫిబ్రవరి 2019’ అని ఉంది.

వీడియో లో ఒక పోలీసు అధికారి యూనిఫామ్ మీద ‘D.P.’ అని ఉంది. ‘D.P.’ అని ఢిల్లీ పోలీసుల యూనిఫామ్ మీద ఉంటుంది.

పోస్టులోని వీడియో గురించి సమాచారం వెతికేటప్పుడు, అదే ఘటన కి సంబంధించిన మరొక వీడియో లభించింది. ఆ వీడియో లో కూడా మరొక పోలీసు అధికారి యూనిఫామ్ మీద కూడా ‘D.P.’ అని ఉండడం చూడవచ్చు.

చివరగా, ఢిల్లీ పోలీసులు డాన్స్ చేస్తున్న పాత వీడియో ని పోస్టు చేసి ‘వివేక్ దూబే ఎన్కౌంటర్ తర్వాత సంబరాలు చేసుకుంటున్న ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll