Fake News, Telugu
 

బొంబాయి కిడ్నీ స్పెషలిస్ట్ Dr టోనీ అల్మైడా మధుమేహానికి సహజ చికిత్స కనుగొన్నట్టుగా షేర్ చేస్తున్న మెసేజ్ తప్పు

0

బొంబాయి కిడ్నీ స్పెషలిస్టూ Dr. టోనీ అల్మైడా విస్త్రుత ప్రయోగాలు నిర్వహించి మధుమేహానికి (డయాబెటిస్) సహజ చికిత్స కనుగొన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఇంట్లోనే గోధమ, బార్లీ, నల్లవిత్తనాల పదార్థాలతో తయారుచేసుకునే ఔషధాన్ని ఉపయోగించి డయాబెటిస్ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని ఈ పోస్టులో తెలుపుతున్నారు. 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్న 65 సంవత్సరాల ఒక మహిళ, ఈ ఔషధాన్ని వాడి డయాబెటిస్‌ని పూర్తిగా తక్కువ చేసుకున్నట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బొంబాయి కిడ్నీ స్పెషలిస్ట్ Dr టోనీ అల్మైడా, మధుమేహానికి (డయాబెటిస్) సహజ చికిత్స కనుగొన్నారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ మెసేజ్ కనీసం 2009 నుండి ఇంటెర్నెట్‌లో షేర్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపే ఈ వ్యాధికి ప్రపంచ దేశాలలోని డాక్టర్లు, పరిశోధకులు ఇంతవరకు శాశ్వత చికిత్స కనుగొనలేదు. డయాబెటిస్‌ని తాత్కాలికంగా నివారించుకునేందుకు డాక్టర్లు, పేషెంట్లని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించమని సలహాలిస్తారు. కావున, పోస్టులో తెలుపుతున్న సమాచారం తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం గుగూల్‌లో వెతికితే, పోస్టులో షేర్ చేసిన ఈ మెసేజ్ కనీసం 2009 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ పాత పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ మెసెజ్‌లో తెలుపుతున్న డాక్టర్ వివరాల కోసం వెతకగా, Dr టోనీ అల్మైడా అనే పేరుతో ముంబైలో ప్రస్తుతం ఒకే ఒక డాక్టర్ ఉన్నట్టు తెలిసింది. BSES MG హాస్పిటల్లో డాక్టర్‌గా పనిచేస్తున్న టోనీ అల్మైడా, ఒక జనరల్ సర్జన్ అని తెలిసింది. Dr టోనీ అల్మైడా అనే పేరుతో బొంబాయిలో కిడ్నీ స్పెషలిసస్ట్ ఎవ్వరు లేరని తెలిసింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసెజ్‌కు సంబంధించి ‘BOOM’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ 2019లో Dr టోనీ అల్మైడాని సంప్రదించింది. Dr టోనీ అల్మైడా, తను డయాబెటిస్‌ చికిత్సకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదని, తన పేరుని చాలా కాలం నుండి ఈ మెసెజ్‌కు లింక్ చేస్తున్నారని ‘BOOM’ సంస్థకు స్పష్టం చేసారు. దీనికి సంబంధించి ‘BOOM’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

మధుమేహం (డయాబెటిస్‌) అనేది ఒక దీర్గకాళిక వ్యాధి. బ్లడ్షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపే ఈ వ్యాధికి ప్రపంచ దేశాలలోని డాక్టర్లు, పరిశోధకులు ఇంతవరకు శాశ్వత చికిత్స కనుగొనలేదు.  అమెరికా ‘Centre for Disease control’ డయాబెటిస్‌కు సంబంధించి పబ్లిష్ చేసిన ఒక ఎడిషన్‌లో, డయాబెటిస్‌తో బాధపడుతున్న పేషెంట్లు మందులు వాడటంతో పాటు బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం మరియు శారీరకంగా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలని తెలిపారు. డయాబెటిస్‌ని తొందరగా గుర్తించి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించిన వారు డయాబెటిస్‌ తీవ్ర పరిణామాల నుండి బయటపడవచ్చని WHO మరియు భారత ప్రభుత్వ NCDC వారు తమ వెబ్సైటులో తెలిపారు.

చివరగా,  బొంబాయి కిడ్నీ స్పెషలిస్ట్ మధుమేహానికి సహజ చికిత్స కనుగొన్నట్టుగా షేర్ చేస్తున్న మెసేజ్ తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll