ప్రయాగ్ నగరంలోని ‘నాగ వాసుకి’ దేవాలయంలో చెక్కిన అద్భుత శిల్పం యొక్క ఫోటో, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజ్ మహల్ ను చూసి ఆనందించే మనం, మన వారసత్వ మహా శిల్ప సంపదను గుర్తించటం లేదు అని ఆ పోస్టులో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రయాగ్ నగరంలోని ‘నాగ వాసుకి’ దేవాలయంలో రాతి మీద చెక్కిన అద్భుత శిల్పం యొక్క ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్నది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సంబంధించిన శిల్పం, అని విశ్లేషణలో తెలిసింది. ఈ శిల్పాన్ని ‘Artistic Banyan Tree’ అని ఉత్సవ్ రాక్ గార్డెన్ వారు తమ వెబ్సైటులో తెలిపారు. ఈ శిల్పం ప్రయగ్ నగరంలోని ‘నాగ వాసుకి’ దేవాలయానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే శిల్పం యొక్క ఫోటో “Where is this?” వెబ్సైటులో దొరికింది. ఫోటోలోని ఆ శిల్పం, కర్ణాటక రాష్ట్రంలోని ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సంబంధించినది అని ఆ వెబ్సైటులో తెలిపారు.
ఈ వివరాల ఆధారంగా మరింత సమాచారం కోసం వెతకగా, పోస్టులో షేర్ చేసిన అదే శిల్పం యొక్క ఫోటో ఉత్సవ్ రాక్ గార్డెన్ వెబ్సైటులో దొరకింది. ఈ శిల్పాన్ని ‘Artistic Banyan Tree’ అని ఉత్సవ్ రాక్ గార్డెన్ వారు తమ వెబ్సైటులో తెలిపారు. ఉత్సవ్ రాక్ గార్డెన్ వారు తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ శిల్పాన్ని మనం చూడవచ్చు.
చివరగా, కర్ణాటక రాష్త్రంలోని ఉత్సవ్ రాక్ గార్డెన్ కి సంబంధించిన శిల్పాన్ని చూపిస్తూ ప్రయాగ్ నగరంలోని ‘నాగ వాసుకి’ దేవాలయంలో రాతి మీద చెక్కిన అద్భుత శిల్పం, అని షేర్ చేస్తున్నారు.
Did you watch our new video?