Fake News, Telugu
 

DCGI ఆదేశాల మేరకే నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కొత్త లేబుల్స్ అతికించి ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్లని ఉపయోగించారు

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడువు తీరిన రెమిడిసివిర్ ఇంజక్షన్లని ఉపయోగించడం వలన చాలా మంది కరోనా రోగులు మృతి చెందినట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. గడువు తీరిన రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేబుల్ పై కొత్త లేబుల్ అతికించి ప్రభుత్వ హాస్పిటల్స్ లో కరోన రోగులకు వేస్తున్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కాం నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో బయటపడినట్టు పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లోని నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో గడువు తీరిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లని కరోనా రోగులకి ఉపయోగిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కాలం చెల్లిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లని వాడుతున్నారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెమిడిసివిర్ ఇంజక్షన్ల యొక్క షెల్ఫ్ లైఫ్ గడువుని ఆరు (6) నెలల నుండి పన్నెండు (12) నెలలకు పొడిగిస్తూ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) ఇష్యు చేసిన ఆర్డర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సోషల్ మీడియా ఫాక్ట్ చెక్ పేజీలో షేర్ చేసింది. DCGI ఆదేశాల మేరకే తయారీదారులు రెమిడిసివిర్ ఇంజెక్షన్ల పై కొత్త లెబుల్స్ అతికించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం గూగుల్ లో వెతికితే, రెమిడిసివిర్ ఇంజెక్షన్లకు సంబంధించి నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ యాజమాన్యంతో ఒక పేషెంట్ బంధువులు గొడవకు దిగిన విషయాన్నీ రిపోర్ట్ చేస్తూ ‘ANI’ న్యూస్ వెబ్సైటు 03 జూన్ 2021 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది.  నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ యాజమాన్యం మార్చి 2021 వరకు గడువున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్లకి కొత్త లెబుల్స్ అతికించి కరోనా రోగులకి ఇస్తున్నట్టు ఒక పేషెంట్ బంధువులు ఆరోపించినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. అయితే, ఈ ఘటన పై విశాఖ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ మీడియాకి స్పష్టత నిచ్చినట్టు ఈ ఆర్టికల్ పేర్కొంది. రెమిడిసివిర్ ఇంజక్షన్ల యొక్క షెల్ఫ్ లైఫ్ గడువుని ఆరు (6) నెలల నుండి పన్నెండు (12) నెలలకు పొడిగించడానికి డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చినట్టు విశాఖ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ స్పష్టం చేసారు. DCGI అనుమతి మేరకే రెమిడిసివిర్ ఇంజెక్షన్ల పై కొత్త లేబుల్స్ ని అతికించి రోగులకి ఇస్తున్నట్టు డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ మీడియాకి తెలిపారు. విశాఖ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్ తెలిపిన ఈ వివరాలని రిపోర్ట్ చేస్తూ ‘The Indian Express’ న్యూస్ వెబ్సైటు కూడా ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కాలం చెల్లిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లని వాడుతున్నారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫాక్ట్-చెకింగ్ ట్విట్టర్ హేండిల్ ద్వారా స్పష్టం చేసింది. రెమిడిసివిర్ అనేది ఒక కొత్త మెడిసిన్ కావడంతో, DCGI తొలి దశలో దాని షెల్ఫ్ లైఫ్ ఆరు నెలలకు సూచించినట్టు ఈ ట్వీట్ లో తెలిపారు. రెమిడిసివిర్ తయారిదారుల అధ్యయనాలను పరిశీలించిన అనంతరం DCGI, రెమిడిసివిర్ ఇంజక్షన్ల షెల్ఫ్ లైఫ్ గడువుని ఆరు (6) నెలల నుండి పన్నెండు (12) నెలలకు పొడిగిస్తూ ఇటీవల ఆర్డర్ ఇష్యూ చేసినట్టు ఈ ట్వీట్ లో తెలిపారు. DCGI ఆదేశాలను అనుసరించే తయరీదారులు పొడిగించిన సమయాలని రెమిడిసివిర్ ఇంజెక్షన్ల బ్యాచ్ నెంబర్ తో సహా ముద్రించినట్టు ఈ ట్వీట్ లో పేర్కొన్నారు.   

రెమిడిసివిర్ ఇంజక్షన్ల షెల్ఫ్ లైఫ్ గడువుని ఆరు (6) నెలల నుండి పన్నెండు (12) నెలలకు పొడిగిస్తూ DCGI ఇష్యూ చేసిన ఆర్డర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షేర్ చేసింది. ఈ వివరాల ఆధారంగా DCGI ఆదేశాల మేరకే నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కొత్త లెబుల్స్ అతికించిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లని ఉపయోగించినట్టు చెప్పవచ్చు.

చివరగా, DCGI ఆదేశాల మేరకే నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కొత్త లేబుల్స్ అతికించిన రెమిడిసివిర్ ఇంజెక్షన్లని ఉపయోగించారు.

Share.

About Author

Comments are closed.

scroll