Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే రాష్ట్ర పన్ను ఎక్కువ కాదు.

0

ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొనే పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ గురించి ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే రాష్ట్ర పన్ను ఎక్కువ అని పోస్టులో ఉన్నట్టు చూడవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పెట్రోల్ ధరలో వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు. పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను ఎక్కువ .

ఫాక్ట్ (నిజం): ): పోస్ట్ లో ఇచ్చిన కేంద్ర పన్ను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను వివరాలు తప్పు. పెట్రోల్ ధరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను కంటే కేంద్ర పన్ను ఎక్కువ. కేంద్ర పన్ను 32.98 రూపాయలు అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను  సుమారు 22 రూపాయలు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఇండియన్ ఆయిల్ వెబ్సైటులో పెట్రోల్ ధరలో ఉండే వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు చూడవొచ్చు (ఆ వివరాలు హిందూస్తాన్ పెట్రోలియం మరియు భారత్ పెట్రోలియం వెబ్సైటుల్లో కూడా చూడవొచ్చు). ఆ వివరాలు ఢిల్లీ కి సంబంధించినవి ఉంటాయి. స్టేట్ పన్ను (వాట్) తప్ప మిగితాయి అన్నీ దేశమంతా ఒకేలా ఉంటాయి. ఢిల్లీ కి సంబంధించిన వివరాలు కింద టేబుల్ లో చూడవొచ్చు (ఆ వివరాలు చివరగా 16 జూన్ 2020 న అప్డేట్ అయ్యాయి).

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘Petroleum Planning and Analysis Cell’ వారి వెబ్ సైట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం ఢిల్లీ లో పెట్రోల్ పై రాష్ట్ర పన్ను –  30% VAT మరియు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పన్ను – 31% VAT + Rs.2.76/litre VAT. అంతేకాదు, పెట్రోల్ పై కేంద్ర పన్ను (ఎక్సైజ్ డ్యూటీ) – Rs. 32.98, పోస్ట్ లో చెప్పినట్టు Rs 19.48 కాదు.

ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధర వివరాలు: (16 జూన్ 2020)

అయితే, 16 జూన్ తర్వాత ఈ ఆర్టికల్ రాసే సమయానికి పెట్రోల్ ధర సుమారు 3 రూపాయల వరకు పెరిగినట్టు ఇండియన్ ఆయిల్ వెబ్సైటులో చూడవొచ్చు. కావున, ఆ పెరుగుదలని ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరకి సర్దుబాటు చేసి చూడగా కూడా పెట్రోల్ ధర లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్ను సుమారు 22 రూపాయలు మాత్రమే. అది కేంద్ర పన్ను 32.98 రూపాయల కంటే తక్కువ.

కేంద్ర పన్ను నుండి రాష్ట్రాలకు కొంత వస్తుంది, కానీ అది కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే మొత్తం నుండి ఆర్ధిక సంఘం సూచించిన నిష్పత్తి ప్రకారం వస్తుంది. ప్రతి రాష్ట్రానికి కేంద్ర పన్నులో 42% రాదు. అంతేకాదు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ లో కొంత ‘Road & Infrastructure cess’ లాగా తీసుకుంటారు, దాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంచదు. పూర్తి వివరాలను ఇక్కడ చూడవొచ్చు.

పెట్రోల్ ధరలో వివిధ పన్నులు మరియు డీలర్ కమిషన్ యొక్క వివరాలు అని చెప్తూ వేరే రేట్లతో ఉన్న ఇంకో పోస్ట్ (ఆర్కైవ్డ్) ని కూడా సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఆ పోస్ట్ లో ఇచ్చిన వివరాలు కూడా తప్పు అని FACTLY ఇంతకముందే 2019 లో రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరలో కేంద్ర పన్ను కంటే రాష్ట్ర పన్ను ఎక్కువ కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll