Fake News, Telugu
 

ఇండియా టుడే విడుదల చేసిన ఉత్తమ ముఖ్యమంత్రుల లిస్టులో జగన్ కి నాల్గవ ర్యాంకు వచ్చింది

0

ఇండియా టుడే సంస్థ విడుదల చేసిన ఉత్తమ ముఖ్యమంత్రుల లిస్టులో జగన్ పేరు లేదని, కానీ ఆ లిస్టులో జగన్ కి నాల్గవ ర్యాంకు వచ్చిందని వైసీపీ పార్టీ వారు తప్పుగా షేర్ చేస్తున్నట్టు చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ఇండియా టుడే విడుదల చేసిన ఉత్తమ ముఖ్యమంత్రుల లిస్టులో జగన్ కి నాల్గవ ర్యాంకు రాలేదు. 

ఫాక్ట్ (నిజం): ‘మూడ్ అఫ్ ది నేషన్’ అనే పేరుతో ఇండియా టుడే వారు నిర్వహించిన సర్వే ప్రకారం ఉత్తమ ముఖ్యమంత్రుల లిస్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి నాల్గవ స్థానం వచ్చింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఇండియా టుడే వారు ‘మూడ్ అఫ్ ది నేషన్’ అనే పేరుతో నిర్వహించిన సర్వే ద్వారా ‘ఉత్తమ ముఖ్యమంత్రుల’ లిస్టుని ప్రచురించినట్టు తెలుస్తుంది. ఆ లిస్టులోని ముఖ్యమంత్రుల పేర్లను చూడగా, ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి జగన్ కి నాల్గవ స్థానం వచ్చినట్టు చూడవొచ్చు. పూర్తి లిస్టుని ‘మూడ్ అఫ్ ది నేషన్’ పేరుతో తాజాగా ఇండియా టుడే వారు రిలీజ్ చేసిన రిపోర్ట్ లో చూడవొచ్చు. అయితే ఇండియా టుడే వారి వెబ్ సైట్ లో ఉన్న లైన్ గ్రాఫ్ లో జగన్ పేరు లేదని కొందరు ఫేస్బుక్ లో రాస్తున్నారు. కానీ, ఆ గ్రాఫ్ లో గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్న వారి ర్యాంకులు పోల్చినట్టు గమనించవచ్చు. ముఖ్యమంత్రిగా జగన్ కి ఇది మొదటి సంవత్సరం కనుక ఆ లైన్ గ్రాఫ్ లో జగన్ పేరు లేదు. ఐదవ ర్యాంకు వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ఆ లైన్ గ్రాఫ్ లో లేనట్టు చూడవొచ్చు, ఎందుకంటే తను కూడా గత సంవత్సరమే ముఖ్యమంత్రి అయ్యాడు.

చివరగా, ఇండియా టుడే విడుదల చేసిన ఉత్తమ ముఖ్యమంత్రుల లిస్టులో జగన్ కి నాల్గవ ర్యాంకు వచ్చింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll