తాజాగా చైనా మరియు ఇతర దేశాల్లో వ్యాప్తిస్తున్న కొరోనా వైరస్ [దాని పేరు ‘2019-nCoV’ (కొరోనా వైరస్ లో ఒక రకం)] కి సంబంధించిన వీడియో అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: తాజాగా వ్యాపిస్తున్న కొరోనా వైరస్ వ్యాధికి సంబంధించిన వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో నవంబర్-2019 నుండి ఇంటర్నెట్ లో ఉంది. కానీ, మొదటిగా కొరోనా వైరస్ (‘2019-nCoV’) వ్యాధి డిసెంబర్-2019 చివరి వారం లో రిపోర్ట్ అయ్యింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియో యూట్యూబ్ లో ఉంటుంది. ఆ వీడియోని నవంబర్-2019 లోనే ‘Guy Has Huge Botfly Larvae Removed from His Lip’ అనే టైటిల్ తో అప్లోడ్ చేసినట్టు చూడవొచ్చు. కానీ, మొదటిగా కొరోనా వైరస్ (‘2019-nCoV’) వ్యాధి డిసెంబర్-2019 చివరి వారం లో రిపోర్ట్ అయినట్టు తెలుస్తుంది. కావున, పోస్టులోని వీడియో ‘2019-nCoV’ వైరస్ కి సంబంధించింది కాదు.
కొరోనా వైరస్ (‘2019-nCoV’) మరియు దాని వ్యాప్తి గురించి మరింత సమాచారం కొరకు అల్ జజీరా వార్తాసంస్థ వారి ఆర్టికల్ చదవొచ్చు.
అంతేకాదు, పోస్టులో చెప్పినట్టు కొన్ని రోజుల వరకు ప్రీసర్వ్డ్ డైరీ ప్రొడక్ట్స్ తినకూడదని ప్రముఖ ఆరోగ్య ఏజెన్సీలు ఏవీ కూడా చెప్పలేదు. ‘2019-nCoV’ వైరస్ వ్యాప్తికి సంబంధించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు సామాన్య ప్రజల కొరకు చెప్పిన జాగ్రత్తలను కింద చూడవొచ్చు
‘2019-nCoV’ వైరస్ పై ప్రజలకు ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ‘Centers for Disease Control and Prevention (CDC)’ వారు రిలీజ్ చేసిన ఫాక్ట్-షీట్ ని ఇక్కడ చదవొచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారి ప్రకారం, 26 జనవరి 2020 నాటికి, మొత్తం 2,014 ఖచ్చితమైన ‘2019-nCoV’ వైరస్ వ్యాధి కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి.
చివరగా, సంబంధం లేని పాత వీడియో పెట్టి, ‘కొరోనా వైరస్’ కి సంబంధించిన వీడియో అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?