ప్రధానమంత్రి మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఓటమి కోసం అస్సాంలోని ముస్లింలు సమావేశం ఏర్పాటు చేసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముస్లిం టోపీలు ధరించిన అనేక మంది వ్యక్తులు “అల్లా-అల్లా” అని నినాదాలు చేయడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ప్రధానమంత్రి మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఓడిపోవాలని అస్సాంలోని ముస్లింలు దేవుడిని ప్రార్థించడాన్ని చూపిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో అస్సాంకి సంబంధించినది కాదు. ఇది బంగ్లాదేశ్‌లోని బారిసల్ జిల్లాలో జరిగిన చార్మోనై మహ్ఫిల్ కార్యక్రమంలోని దృశ్యాలను చూపిస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
అస్సాంలోని ముస్లింలు ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఓడిపోవాలని దేవుడిని ప్రార్థించారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు.
తదుపరి, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను కలిగి ఉన్న పలు సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) లభించాయి. వాటిలో ఒక వీడియోలో బ్యాక్గ్రౌండ్‌లోని బ్యానర్‌పై “చార్మోనై అవాజ్ మెహ్ఫిల్” అని రాసి ఉండడం గమనించాం.

చార్మోనై ఆవాజ్ మెహ్ఫిల్ గురించి మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, చార్మోనై మహఫిల్ (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) అనేది బంగ్లాదేశ్‌లోని బారిసల్‌లో ఉన్న చార్మోనై దర్బార్ షరీఫ్‌లో నిర్వహించే ఒక కార్యక్రమం, ఇది సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది: ఒకసారి బెంగాలీ నెల అగ్రహాయణంలో, మరొకసారి ఫాల్గుణంలో. 2025లో ఫాల్గుణ మహ్ఫిల్ 19 ఫిబ్రవరి న ప్రారంభమైంది, ఇటీవలి అగ్రహాయణ మహ్ఫిల్ 26 నవంబర్ 2025 నుండి 28 నవంబర్ 2025 వరకు జరిగిందని మేము తెలుసుకున్నాము (ఇక్కడ, ఇక్కడ).

వైరల్ వీడియోలో కనిపించే గడియారం చార్మోనై మహ్ఫిల్ కార్యక్రమాన్ని రిపోర్ట్ చేసే పలు వార్తా కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ), అలాగే చార్మోనై దర్బార్‌తో అనుబంధంగా ఉండే రాజకీయ పార్టీ ‘ఇస్లామి ఆండోలోన్ బంగ్లాదేశ్’ ఈ మెహ్ఫిల్ గురించి చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో కూడా ఉండటం మేము గమనించాం.

చివరిగా, అస్సాంలో కొంతమంది ముస్లింలు మోదీ, హిమంత బిస్వా శర్మ ఓటమి కోసం ప్రార్థిస్తున్నారంటూ సంబంధం లేని వీడియోను షేర్ చేస్తున్నారు.

