Fake News, Telugu
 

ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ పార్టీలకు లభించనున్న సీట్ల సంఖ్య అంటూ Lokniti-CSDS పేరిట ప్రచారం లో ఉన్నది వారి అధికారిక సర్వే రిపోర్ట్ కాదు

0

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు రాబోయే ఓట్ల శాతం మరియు సీట్ల సంఖ్యా అంటూ Lokniti-CSDS పేరిట ఉన్న సర్వే రిపోర్ట్ ని చాలా మంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇదే సర్వే ఆధారంగా ప్రముఖ వార్తా పత్రిక ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనాన్ని కుడా ప్రచురించింది. ఈ సర్వే ఎంతవరకు నిజమో ఓసారి విశ్లేషిద్దాం.ఈ పోస్ట్ యొక్క ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

ఆంధ్రజ్యోతి పత్రిక లో ప్రచురితమైన కథనానికి సంబంధించిన ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు

క్లెయిమ్ (దావా): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో వివిధ పార్టీలకు రాబోయే ఓట్ల శాతం మరియు సీట్ల సంఖ్యా అంటూ ప్రముఖ సర్వే సంస్థ  Lokniti-CSDS సర్వే ఫలితాలు విడుదల చేశారు, అందులో TDP కి అత్యధిక సీట్లు వచ్చాయి.

ఫాక్ట్ (నిజం): సర్వే సంస్థ Lokniti-CSDS తాము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంభిందించిన సర్వే ఫలితాలు ఎక్కడా వెల్లడించలేదని, ప్రచారంలో ఉన్న రిపోర్ట్ కి తమకి ఎటువంటి సంబంధం లేదంటూ అధికారిక లేఖను విడుదల చేశారు. కావున, Lokniti-CSDS సంస్థ పేరిట ప్రచారంలో ఉన్న సర్వే రిపోర్ట్ ఒక నకిలీ రిపోర్ట్.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో వివిధ పార్టీలకు రాబోయే ఓట్ల శాతం మరియు సీట్ల సంఖ్య కి సంబంధించిన గణాంకాలతో కూడిన సర్వే రిపోర్ట్ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ రిపోర్ట్ కోసమై సర్వే సంస్థ Lokniti-CSDS యొక్క అధికారిక వెబ్సైటులో చూసినప్పుడు ఒక లేఖ లభించింది. అందులో వారు తాము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంభిందించిన సర్వే ఫలితాలు ఎక్కడా వెల్లడించలేదని, ప్రచారంలో ఉన్న రిపోర్ట్ కి తమకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేసారు.

చివరగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సర్వే సంస్థ Lokniti-CSDS ఎటువంటి ఫలితాలు వెల్లడించలేదు. అలా ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll