అరిగిపోయిన రైలు చక్రం చిత్రం ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, ‘75 సంవత్సరాలలో మొదటి సారి రైలు చక్రానికి పంక్చర్ అయ్యింది…అసలు ఎవడికి ఇస్తున్నావ్ తాతా కాంట్రాక్టు..’ అని పోస్ట్ యొక్క వివరణలో రాసి ఉంది. ఇటీవల న్యూ ఢిల్లీ-వారణాసి వందే భరత్ ఎక్స్‌ప్రెస్ ఫ్లాట్ టైర్ కారణంగా ఒకరోజు ప్రయాణం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దీన్ని ఉద్దేశిస్తున్నట్లుగా ఈ పోస్టు ఉంది. పోస్టులోని క్లెయిమ్ ని ఈ ఆర్టికల్ ద్వారా ఫాక్ట్-చెక్ చేద్దాం.
క్లెయిమ్: వందే భరత్ ఎక్స్‌ప్రెస్ ఫ్లాట్ టైర్ యొక్క చిత్రం.
ఫ్యాక్ట్ (నిజం): వైరల్ పోస్టులో ఉన్న చిత్రం స్వీడన్‌లోని చామర్స్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ యొక్క మాస్టర్స్ విద్యార్థుల థీసిస్‌లొనిది. సంబంధంలేని చిత్రాన్ని వందే భరత్ రైలు పంక్చర్‌కి సంబంధించినదిగా పోస్టులో చప్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వందే భరత్ రైలు చక్రానికి పంక్చర్ అయినట్లుగా ఏమైనా వార్తా కథనాలు ఉన్నాయా అని ఇంటెర్నెట్‌లో వెతకగా పలు కథనాలు లభించాయి. ది హిందూ వారి రిపోర్టు ప్రకారం ‘న్యూ ఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్షన్ మోటారులో ఇబ్బంది కారణంగా దాని చక్రాలు జామ్ అయ్యాయి, వాటి ఖచ్చితమైన గుండ్రనితనాన్ని ఇది దెబ్బతీసినది, అందుచేత శనివారం ఆపరేషన్ నిలిపివేయబడింది, ఈ పరిస్థితిని అధికారులు “ఫ్లాట్ టైర్”గా చెప్పారు.’ ఈ సంఘటన అక్టోబర్ 8వ తారీఖున జరిగింది. ఇదే సంఘటనపైన మిగతా వార్త పత్రికల చేసిన కథనాల్ని మీరు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు. ఏ ఒక్క రిపోర్టులో కుడా రైలు “ఫ్లాట్ టైర్” యొక్క ఫోటోని ప్రచురించలేదు.
పోస్టులోని ఫోటోని ఇంటెర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా అదే చిత్రం స్వీడన్‌లోని చామర్స్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ యొక్క మాస్టర్స్ విద్యార్థుల థీసిస్‌లొ లభించింది. ఇది 2012లో ప్రచురితమైంది. ‘చక్రం నష్టం – సంభావన మరియు నష్టం గుర్తించడం’ అనే భాగంలో ఈ చిత్రం ఉంది. దీన్ని కింద చూడవచ్చు.
చివరగా, 2012లో ప్రచురితమైన చిత్రాన్ని ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పంక్చర్ కి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు.