చెన్నైలో మిగ్‌జాం తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సుడిగాలి దృశాలు అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఈ వీడియో చెన్నైలో సుడిగాలి దృశ్యాలను చూపిస్తుంది.
ఫాక్ట్(నిజం): షట్టర్‌స్టాక్ వెబ్‌సైట్‌లో ఇలాంటి విజువల్స్‌ను చూపించే వీడియోను “కోస్టల్ టౌన్‌లో హరికేన్ వల్ల నష్టం” అనే టైటిల్‌తో ప్రచురించబడింది. ఈ అసలు వీడియోలో సుడిగాలి దృశ్యాలు కనిపించలేదు. కానీ, అదే వీడియో @rtsarovvideo అనే పేరు గల YouTube ఛానల్ సుడిగాలి ఉన్నట్టుగా ఎడిట్ చేసి పోస్టు చేసింది. ఇది నిజమైన సుడిగాలి వీడియో కాదు, చెన్నైతో ఏ సంబంధం లేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, షట్టర్‌స్టాక్ వెబ్‌సైట్‌లో ఇలాంటి విజువల్స్‌ను చూపించే వీడియోను “కోస్టల్ టౌన్‌లో హరికేన్ వల్ల నష్టం” అనే టైటిల్‌తో ప్రచురించబడింది. అయితే, ఈ అసలు వీడియోలో సుడిగాలి దృశ్యాలు కనిపించలేదు అని గమనించాం.
దీని గురించి కీ వర్డ్స్ ఉపయోగించి వెతికితే, చెన్నైలో ఇటువంటి దృశ్యం చోటుచేసుకున్నట్టు ఏ మీడియా ఛానల్ లేదువార్తా పత్రిక ప్రచురించినట్టు కనపడలేదు. అయితే, ఈ దృశ్యం ఏ ప్రదేశంలో చోటుచేసుకుందో తెలియనప్పటికీ, అదే వీడియో 4 సెప్టెంబర్ 2023న @rtsarovvideo అనే పేరు గల YouTube ఛానల్లో ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. ఈ YouTube ఛానెల్, వీధులను తుడిచిపెట్టే అనేక టొర్నాడో వీడియోలను ప్రచురించింది. వీడియో యొక్క అబౌట్ విభాగంలో, ఛానెల్ వారు తాము తీవ్రమైన వాతావరణ పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఎడిటెడ్ వీడియోలను రూపొందిస్తామని పేర్కొన్నారు.
చివరిగా, చెన్నైలో ఇటీవలి సుడిగాలి ఫుటేజీ అంటూ సంబంధం లేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు.