కొంతమంది మగవాళ్ళు ఒక మహిళని అసభ్యకరంగా పట్టుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది (పోస్ట్). పోస్టులో క్లెయిమ్ ప్రకారం ఆ మగవాళ్ళు ముస్లింలు. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క వాస్తవికతని తనిఖీ చేద్దాం.

క్లెయిమ్: ఒక హిందూ మహిళపై కొందరు ముస్లింలు దాడి చేయడాన్ని ఈ ఫోటో (వీడియో) చూపుతోంది.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2021లో బీహార్‌లో జరిగిన ఒక సంఘటనకు చెందినది. బీహార్‌లోని సరన్ జిల్లాలో ఒక మహిళపై కొందరు పురుషులు, అసభ్యంగా తాకుతూ దాడి చేసారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు దాఖలు చేసిన FIR ప్రకారం నిందితులందరూ హిందువులే. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ ఫోటో ఒక వీడియో యొక్క స్క్రీన్ షాట్ (ట్వీట్ చూడండి) అని తెలిసింది. ఇది బీహార్‌కు చెందిన సంఘటనగా ఈ ట్వీట్ దీన్ని వివరించింది. ఈ సమాచారాన్ని క్లూ లాగా తీసుకుని, మేము ఆన్‌లైన్‌లో కీవర్డ్ సెర్చ్ చేసి వెతకగా, ఈ సంఘటనపై 2021లో వచ్చిన అనేక వార్తల కథనాలకు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) దారితీసింది.

బీహార్‌లోని సరన్ జిల్లాలో కొందరు వ్యక్తులు ఒక మహిళను ఆటపట్టించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దరియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నమోదైన FIR కాపీని మేము బీహార్ పోలీస్ వెబ్సైట్ నుండి download చేసి చూసాము, దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. FIR ప్రకారం, నిందితులందరూ హిందూ మతానికి చెందినవారు, పోస్టులో చెప్తున్నట్లు ముస్లింలు కాదు .

చివరిగా, బీహార్‌కి చెందిన ఒక పాత వీడియో ఇది, దీనిలో ఆరుగురు హిందూ పురుషులు ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు.