Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, పాకిస్థాన్ దేశ ప్రజలను కొరోనావైరస్ నుండి కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ మూతపడి ఉన్న శివాలయాన్ని తెరిపించాడని ప్రచారం చేస్తున్నారు

0

ఒక న్యూస్ వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, పాకిస్థాన్ దేశ ప్రజలను కొరోనావైరస్ నుండి కాపాడుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ సియాల్ కోట (పాకిస్తాన్) లో 72 సంవత్సరాలుగా మూతపడి ఉన్న ఒక శివాలయాన్ని తెరిపించి పూజలు చేపిస్తున్నాడని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. కానీ FACTLY విశ్లేషణ లో ఆ న్యూస్ వీడియో జూలై 2019 లో ప్రసారమైనట్లుగా తేలింది. అంటే, ఆ న్యూస్ వీడియో ప్రపంచంలో మొట్టమొదటి కొరోనావైరస్ కేసు నమోదవడానికంటే ముందే ప్రసారం అయింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సియాల్ కోట (పాకిస్తాన్) లో 72 సంవత్సరాలుగా మూతపడి ఉన్న షావలా తీజా సింగ్ ఆలయాన్ని(శివాలయం) తిరిగి తెర్పిస్తున్నాడని ఆ న్యూస్ వీడియో లో రిపోర్టర్ చెప్తుంది. అదే విషయాన్ని వివిధ వార్తా సంస్థలు కూడా జూలై 2019 లోనే ప్రచురించినట్లుగా ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ వీడియో – https://www.facebook.com/news24channel/videos/470094753755070/?v=470094753755070

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll