Fake News, Telugu
 

కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి అని కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ‘కేసీఆర్‌ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్న, కాంగ్రెస్‌కే గుద్దండి’ అంటూ కేటీఆర్ ఈ వీడియోలో మాట్లాడుతుండడం చూడొచ్చు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జలవిహార్‌లో జరిగిన న్యాయవాదుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ వై.ఎస్.షర్మిలను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. ‘కేసీఆర్‌ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్న, కాంగ్రెస్‌కే గుద్దండి’ అని షర్మిల అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించాడు. ఐతే ఈ వ్యాఖ్యలలో షర్మిల ప్రస్తావన వదిలేసి కేవలం ‘కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి’ అన్న వ్యాఖ్యలను కేటీఆర్‌కు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

తెలంగాణ అస్సెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరున జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఐతే నిజానికి కేటీఆర్ ఇలా అనలేదు. వేరొక సందర్భంలో చేసిన ఉపన్యాసాన్ని అసంపూర్ణంగా కట్ చేసి షేర్ చేస్తున్నారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా జలవిహార్‌లో జరిగిన న్యాయవాదుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించిన అంశం గురించి మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసాడు. కేసీఆర్‌ను ఓడించడానికి అన్నీ పార్టీలు ఒకటి అవుతున్నాయి అనే చెప్తూ, ‘ఇటీవల షర్మిల గారు ప్రకటించారు, కేసీఆర్‌ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్న, కాంగ్రెస్‌కే గుద్దండి’  అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించాడు.

ఐతే కేటీఆర్ షర్మిల గురించి ప్రస్తావించిన వ్యాఖ్యలను వదిలేసి కేవలం ‘కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి’ అన్న వ్యాఖ్యలను మాత్రమే షేర్ చేస్తున్నారు. దీనిబట్టి కేటీఆర్ ఉపన్యాసాన్ని అసంపూర్ణంగా ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. కేటీఆర్ ఉపన్యాసానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, కేటీఆర్ ఉపన్యాసాన్ని అసంపూర్ణంగా ఎడిట్ చేసి కాంగ్రెస్‌కే ఓట్లు గుద్దండి అని కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll