Fake News, Telugu
 

మాజీ హోం మంత్రి మాధవ రెడ్డి, లోకేష్ , భువనేశ్వరితో ఉన్న ఈ ఫోటో మార్ఫ్ చేసిన ఫేక్ ఫోటో

0

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్, ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డితో ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఇందులో ఉన్న నిజానిజాలను తెలుసుకుందాం.

దీని ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: నారా లోకేష్, నారా భువనేశ్వరితో ఎలిమినేటి మాధవ రెడ్డి కలిసి దిగిన ఒక  పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): ఇదొక ఫేక్ ఫోటో , డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటో. అసలు ఫోటోలో నారా లోకేష్, నారా భువనేశ్వరితో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలని వెరిఫై చేయడానికి, ముందుగా మేము వైరల్ ఫోటోని ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్‌ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా,నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ మరియు భార్య నారా భువనేశ్వరితో కలిసి ఉన్న వైరల్ ఫోటో యొక్క అసలు వెర్షన్‌ మాకు దొరికింది. ఇండియా హెరాల్డ్ మరియు అనేక బ్లాగులు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఈ ఫోటోను అప్‌లోడ్ చేశాయి. 

అసలు ఫోటో, వైరల్ ఫోటో మధ్య వ్యత్యాసాన్ని మీరు ఈ కింది ఉన్న కొల్లాజ్‌లో చూడవచ్చు. వైరల్ ఫోటోను తయారు చేయడానికి CBN తన కుటుంబంతో ఉన్న ఫోటోను,డిజిటల్‌గా ఎడిట్ చేశారని ఇది స్పష్టం చేస్తుంది.

తగిన కీ వర్డ్స్ ఉపయోగించి, ఉమ్మడి AP మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి ఫోటోల కోసం వెతకగా, వైరల్ ఫోటోను పోలిన ఫోటోను కలిగి ఉన్న అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, ఆర్టికల్స్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు దొరికాయి. దీన్ని వాడి వైరల్ ఫోటోను డిజిటల్‌గా ఎడిట్ చేశారని మనకి ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.  

చివరిగా, ఒక డిజిటల్‌గా ఎడిట్ చేసిన ఫోటోని, నారా లోకేష్ మరియు నారా భువనేశ్వరి, ఎలిమినేటి మాధవ రెడ్డితో కలిసి దిగిన ఒక నిజమైన ఫోటో అని తప్పుగా షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll