“ ఓట్ల నమోదు గురించి మహిళా పోలీసులకు ఎం తెలుసు?…మహిళలు సులువుగా లంచాలకు లొంగిపోతారు” అని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసారని చెప్తున్న Way2News గ్రాఫిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మహిళా పోలీసులపై “ ఓట్ల నమోదు గురించి మహిళా పోలీసులకు ఎం తెలుసు?…మహిళలు సులువుగా లంచాలకు లొంగిపోతారు” అని అనుచిత వ్యాఖ్యలు చేసారు అని చెప్తున్న Way2News గ్రాఫిక్.
ఫ్యాక్ట్(నిజం): Way2Newsలో రిపోర్టు అయినట్లు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వైరల్ గ్రాఫిక్ ఫేక్ అని, Way2News లోగోని ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు అని Way2News ఫ్యాక్ట్-చెక్ వారు తమ ‘X’ హ్యాండిల్ ద్వారా చెప్పారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఈ వైరల్ క్లెయిమ్ యొక్క నిజానిజాల్ని తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ అవుతున్న గ్రాఫిక్ వారు ప్రచురించింది కాదు అని చెప్తూ Way2News ఫ్యాక్ట్-చెక్ వారు ‘X’ లో చేసిన ఒక ట్వీట్ దొరికింది. వైరల్ గ్రాఫిక్‌ని పోస్ట్ చేస్తూ, ఈ కథనం Way2News చేసింది కాదని, వారి లోగోను ఉపయోగించి కొందరు ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఈ ట్వీట్ ద్వారా Way2News స్పష్టం చేసింది.
అయితే, అసలు నారా చంద్రబాబు నాయుడు వైరల్ గ్రాఫిక్‌లో చెప్తున్నట్టు అలంటి వ్యాఖ్యలు ఏమైనా చేసారా అని ఇంటర్నెట్లో వెతకగా. ఈరోజు అనగా, 9 జనవరి 2024 నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యణ్, నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ ఎలక్షన్ కంమిషనర్ (CEC) ‘రాజీవ్ కుమార్’ని కలిసి కొన్ని ఫిర్యాదులు చేసారని వచ్చిన వార్తా కథనాలు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ).
CECని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ 83 నియోజకవర్గాల్లో 2600 మంది మహిళా పోలీసులని BLOలుగా (ప్రభుత్వం) నియమించింది అని, “మహిళా పోలీసులకి ఎం తెలుస్తుంది ఇవన్నీ (ఎలక్షన్ సందర్భంలో)” అని అన్నారు. అయితే, ఒకప్పుడు టీచర్లని ఆఫీసర్లని BLO (బూత్ లెవెల్ ఆఫీసర్)లుగా పెట్టేవారని ఇప్పుడు మహిళా పోలీసులని పెట్టారు అని చెప్తూ ఈ మాటని అన్నారు ఆయన (ఇక్కడ, ఇక్కడ). ఇంతకు మించి, వైరల్ అవుతున్న క్లెయిమ్ చెప్తున్నట్లు మహిళలు సులువుగా లంచాలకు లొంగిపోతారని, మగవారితో సమానంగా మహిళలు పని చేస్తారా? అని తాను అనలేదు.
చివరిగా, మహిళా పోలీసులపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖలు చేసారని Way2Newsలో రిపోర్టు అయినట్లు సోషల్ మీడియాలో ఒక ఎడిట్ చేసిన గ్రాఫిక్ వైరల్ అవుతోంది.