Fake News, Telugu
 

2018లో ఒక PILలో సుప్రీం కోర్టు తీర్పుకు సంబంధించిన అర్టికల్‌ను తప్పుడు క్లైములతో షేర్ చేస్తున్నారు

0

“వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఎన్నికల నుండి బహిష్కరించే దిశగా దేశ అత్యున్నత న్యాయస్థానం? అన్ని కేసులు పెట్టుకుని రాజకీయ పార్టీ ఎలా నడుపుతారు అని ప్రశ్న. అయోమయం లో వైస్సార్సీపీ పార్టీ. 2024 లో వేరే అధ్యక్షుడిని వెతుక్కునే పనిలో ఆ YSRCP పార్టీ” అంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: అన్ని కేసులు పెట్టుకుని రాజకీయ పార్టీని జగన్ మోహన్ రెడ్డి ఎలా నడుపుతున్నాడు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. 

ఫాక్ట్(నిజం): ఇది 12 ఫిబ్రవరి 2018న లైవ్ లా వెబ్సైటులో ప్రచురించబడ్డ ఆర్టికల్ స్క్రీన్ షాట్. దోషులుగా తేలిన వ్యక్తులను రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించకుండా నిషేధించాలని కోరుతూ దాఖలు చేసిన PILలో, నేరస్థుడైనా, అవినీతిపరుడైనా దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీకి నాయకత్వం వహించకూడదని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఈ అంశంపై తుది వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి  కీ వర్డ్ కీ వర్డ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా, ఇది 12 ఫిబ్రవరి 2018న లైవ్ లా వెబ్సైటులో ప్రచురించబడ్డ ఆర్టికల్ అని తెలిసింది.

ఈ ఆర్టికల్, దోషులుగా తేలిన వ్యక్తులను రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించకుండా నిషేధించాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ 2018లో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణను వివరించింది.‘‘శిక్ష పడిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయలేడు. అలాంటప్పుడు ఆయన రాజకీయ పార్టీ పెట్టి అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు? మీరు వ్యక్తిగతంగా చేయలేనిది, కొందరు ఏజెంట్ల ద్వారా సమిష్టిగా చేయగలరా? అదే మా ప్రశ్న.” నేరస్థుడైనా, అవినీతిపరుడైనా దోషిగా తేలిన వ్యక్తి రాజకీయ పార్టీకి నాయకత్వం వహించకూడదని సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఈ అంశంపై తుది వైఖరి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.

అయితే, ఈ క్లెయిమ్ గురించి మరింత వెతకగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘు రామకృష్ణ రాజు, జగన్మోహన్ రెడ్డికి సంబందించిన ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసుపై పిటిషన్ దాఖలు చేసారు. అయితే దీనికి స్పందిస్తూ 03 నవంబర్ 2023న సుప్రీం కోర్టు,  వై.స్. జగన్మోహన్ రెడ్డి పై  కేసును విచారణ ముగియడానికి ఎక్కువ సమయం పట్టడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తూ, జగన్మోహన్ రెడ్డి మరియు CBI స్పందించాలి అంటూ నోటీసులు జారీ చేసింది (క్కడ మరియు ఇక్కడ).

చివరిగా, 2018లో ఒక PILపై సుప్రీం కోర్టు తీర్పుకు సంబంధించిన అర్టికల్‌ను తప్పుడు క్లైములతో  షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll